జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మరికొద్ది రోజుల్లో పచ్చని పెండ్లి పందిట్లో డప్పు చప్పుళ్లు, బంధువుల సందడితో కళకళలాడాల్సిన ఆ ఇల్లు శ్మశాన వైరాగ్యాన్ని అలుముకుంది. కొత్త బైక్ మురిపెం తీరకముందే ఆ యువకుడు మృత్యు ఒడిలోకి చేరుకున్నాడు.
రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడి ప్రాణాలు కోల్పోగా.. మరో యువకుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. కర్కపల్లి గ్రామానికి చెందిన జట్టి సిద్దూ ఇటీవల పల్సర్ బైక్ కొన్నాడు. సోమవారం రాత్రి మిత్రుడు వేముల రాజ్ కుమార్ కు బైక్ దావత్ ఇచ్చేందుకు గణపురం వెళ్లారు.
తిరిగి వస్తున్న క్రమంలో కొండగట్టుకు వెళ్లివస్తున్న టవేరా వాహనాన్ని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో వేముల రాజ్ కుమార్ (24)అక్కడికక్కడే మృతి చెందగా.సిద్దూ తీవ్రంగా గాయపడ్డాడు. అయితే రాజ్ కుమార్ కు ఇటీవలే నిశ్చితార్థం సైతం అయింది. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ద తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.