ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు రుమేయ్సా గెల్గీ (24). పొడువు 7 అడుగుల 0.7 అంగుళాలు. ప్రపంచంలోనే అత్యంత పొడగరైన మహిళగా గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకెక్కారు. టర్కీకి చెందిన ఈమె ‘వేవర్ సిండ్రోమ్’ అనే వ్యాధితో బాధపడుతున్నారు. ఈ కారణంగానే ఆమె ఇలా అనూహ్యంగా పెరిగారు. ‘మనలోని కొన్ని ప్రతికూలతలు కొత్త గుర్తింపునిస్తాయ’న్న గెల్గీ మాటలు పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయి.