హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో 12 కాలేజీల ట్యూషన్ ఫీజులపై తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ(టీఏఎఫ్ఆర్సీ) పునర్విచారణ జరుపనున్నది. ఈ నెల 15,16 తేదీల్లో సదరు కాలేజీల్లో ఫీజుల సవరణపై విచారించనున్నది.
వీటిలో 11 ఇంజినీరింగ్, ఒక లా కాలేజీ ఉన్నాయి. ఈ కాలేజీల్లో ఫీజులను ప్రభుత్వం ఖరారుచేసింది. తమకు అన్యాయం జరిగిందని కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. కోర్టు తీర్పు మేరకు రెండు రోజుల్లో పునర్విచారణ జరుపనున్నది.