ప్రపంచ లీగ్ క్రికెట్లో అత్యంత ఖరీదైన టోర్నీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అనే విషయం తెలిసిందే. ఇది గెలిచిన జట్టుకు దక్కే ప్రైజ్ మనీ కూడా అదే స్థాయిలో ఉంటుంది. మరి దీంతో పోలిస్తే అంతర్జాతీయ స్థాయిలో జరిగే టీ20 ప్రపంచకప్ ప్రైజ్ మనీ ఏ స్థాయిలో ఉంటుంది? అనే అనుమానం రాకమానదు.
ఒకసారి ఈ ప్రైజ్ మనీ వివరాలు గమనిస్తే.. పొట్టి ప్రపంచకప్ కన్నా ఐపీఎల్ ప్రైజ్ మనీనే ఎక్కువ అని తెలుస్తుంది. అందుకే అనుకుంటా చాలా మంది ఆటగాళ్లు కేవలం ఐపీఎల్‌కే ప్రాధాన్యమిస్తారని అభిమానులు విమర్శలు చేస్తుంటారు. ఒక్క భారత్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను ఉర్రూతలూగించే ఐపీఎల్ విజేతలకు ఏకంగా రూ.20 కోట్ల ప్రైజ్‌మనీ దక్కుతుంది.
అదే టీ20 ప్రపంచకప్ గెలిస్తే దక్కేది రూ.13.02 కోట్లు మాత్రమే. ఆ తర్వాతి స్థానంలో కరీబియన్ ప్రీమియన్ లీగ్ ఉంది. ఈ టోర్నీ ప్రైజ్‌మనీ రూ.8.14 కోట్లు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) ప్రైజ్‌మనీ రూ.6.92 కోట్లు కాగా.. ఆస్ట్రేలియా వేదికగా జరిగే బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్) ప్రైజ్‌మనీ రూ.3.66 కోట్లు. ఐపీఎల్‌తో పోలికలు తీసుకొచ్చే పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) ప్రైజ్‌మనీ కేవలం రూ.3.40 కట్లు మాత్రమే కావడం గమనార్హం. చివరగా ఇటీవల పాపులర్ అవుతున్న హండ్రెండ్ లీగ్ ప్రైజ్‌మనీ 1.3 కోట్లు.