ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో భారత జట్టు నుంచి ఒకే ఒక్కడు టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. అతనే యువ ఓపెనర్ ఇషాన్ కిషన్. సౌతాఫ్రికాతో జరగుతున్న టీ20 సిరీస్‌లో పరుగుల వరద పారిస్తున్న ఈ ఎడమ చేతి వాటం ప్లేయర్.. ఏకంగా 68 స్థానాలు మెరుగై 7వ ర్యాంకును చేరుకున్నాడు.
ఈ జాబితాలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ తొలి స్థానంలో కొనసాగుతుండగా.. ఒక స్థానం మెరుగైన పాక్ ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ రెండో స్థానం చేరాడు. బౌలర్ల జాబితాలో ఆసీస్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ రెండు స్థానాలు మెరుగై మొదటి ర్యాంకును కైవసం చేసుకున్నాడు.
అసలు ఈ టాప్ టెన్ జాబితాలో ఒక్క భారత బౌలర్ కూడా లేకపోవడం గమనార్హం. ఆల్‌రౌండర్ల జాబితాలో కూడా ఒక్క భారత ఆటగాడు కూడా లేడు. శ్రీలంకతో సిరీస్‌లో రాణించిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ రెండు స్తానాలు మెరుగై నాలుగో ర్యాంకుకు చేరుకున్నాడు.
Josh Hazlewood claims No.1 spot🔝
Ishan Kishan gallops into top 10 🔥
Glenn Maxwell, Wanindu Hasaranga gain 🔼Plenty of 📈📉 in the @MRFWorldwide ICC Men's T20I Player Rankings 👉 https://t.co/ebcusn3vBT pic.twitter.com/dyQVqkmRPG
— ICC (@ICC) June 15, 2022