పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో టెన్నిస్ స్టార్స్ డానిల్ మెద్వెదెవ్, రఫెల్ నాదల్, కాస్పర్ రూడ్, సబలెంక, స్వియాటెక్, పౌల బడోస జోరు కొనసాగిస్తున్నారు. గురువారం జరిగిన రెండో రౌండ్లో దూకుడు కనబర్చిన వీరంతా ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లారు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో నాదల్ 6-3, 6-1, 6-4తో మౌటెట్ (ఫ్రాన్స్)ను ఓడించి ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. మహిళల పోరులో సబలెంక, స్వియాటెక్ ముందడుగు వేయగా.. కొలిన్స్ తడబడి టోర్నీ నుంచి వైదొలిగింది. టాప్‌సీడ్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) 6-0, 6-2తో అలిసన్ రిస్కె (అమెరికా)పై అలవోక విజయం సాధించగా.. మరోపోరులో బెలారస్ దిగ్గజం సబలెంక 6-1, 6-3తో మాడిసన్ బ్రెంగిల్ (అమెరికా)ను చిత్తు చేసింది.
సానియా, బోపన్న ముందంజ
ఈ టోర్నీలో భారత టెన్నిస్ స్టార్లు సానియా మీర్జా, రోహన్ బోపన్న ముందంజ వేశారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సానియా జోడీ శుభారంభం చేయగా.. పురుషుల డబుల్స్ బోపన్న ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. సానియా- లూసీ హర్డెకా ద్వయం 4-6, 6-2, 6-1తో జాస్మిన్-మార్టినా (ఇటలీ) జోడీని చిత్తు చేసింది. పురుషుల డబుల్స్ బోపన్న- మిడిల్‌కూప్ జోడీ ప్రిక్వార్టర్స్చేరింది.