e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, October 27, 2021
Home News Suryapet: అంబానీ, ఆధాని ప్రయోజనాలకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట.. ఐద్వా జాతీయ అధ్యక్షురాలు మాలిని భట్టాచార్య

Suryapet: అంబానీ, ఆధాని ప్రయోజనాలకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట.. ఐద్వా జాతీయ అధ్యక్షురాలు మాలిని భట్టాచార్య

బొడ్రాయిబజార్: అంబాని, ఆధానీల ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తూ ప్రజల ప్రయోజనాలకు నష్టం కలిగించే చర్యలకు బీజేపీ ప్రభుత్వం పాల్పడుతున్నదని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) జాతీయ అధ్యక్షురాలు మాలిని భట్టాచార్య ఆరోపించారు. శనివారం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) రాష్ట్ర 3వ మహాసభల సందర్భంగా రెండో రోజు నిర్వహించిన ప్రతినిధుల సభను ఆమె ప్రారంభించి మాట్లాడారు.

ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ కార్పోరేట్ శక్తులకు లాభాలు చేకూరేలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహ రిస్తున్నదన్నారు. కొద్దిమంది ప్రయో జనాల కోసం పేదలపై పెనుభారం మోపుతున్నారని విమర్శించారు. కేంద్రంలోని బీజే పీ ప్రభుత్వం చేస్తున్న మనువాద హిందుత్వ విధానాలకు వ్యతిరేకంగా మహిళా లోకం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కేంద్రం అనుసరిస్తున్న మహిళా వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

కేంద్ర ప్రభుత్వ విధానాల మూలంగా భారతదేశం తీవ్రమైన ఆర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుందన్నారు. మరో పక్క దేశంలో కరోనా విజృంభించి 4లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో మహిళలపై, పసి పాపలపై, చిన్నారులపై లైంగికదాడులు రోజు రోజుకు పెరుగుతున్నాయని ఆం దోళన వ్యక్తం చేశారు. చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ బిల్లు 1996 నుంచి 25ఏండ్లుగా పార్లమెంట్ గోడలకు వేలాడుతూ పాలకుల పురుషాధిక్య వైఖరిని ప్రశ్ని స్తుందన్నారు.

భారత స్వాతంత్ర ఉద్యమంలో మహిళలు నిర్వహించిన పాత్ర మరువలేనిదన్నారు. దేశంలో దళిత మహిళలకు ఆత్మ గౌరవం, స్వేచ్ఛ సమానత్వం, వివక్షత రూపు మాపినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లు అన్నారు. దేశ ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్‌ను వేయాలని డిమాండ్ చేశారు. పాలకులకు ఏ మాత్రం చిత్త శుద్ధి ఉన్నా ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్న మత్తు పదార్థాల అక్రమ సరఫరాను నిలిపివేసేలా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

మహిళల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఈ నెల 27న కేంద్రంలోని బీజేపీ తీసు కొచ్చిన రైతు వ్యతిరేక మూడు చట్టాల ను రద్దు చేయాలని, కార్మిక చట్టాల సవరణ నిలిపి వేయాలని, ఉపాధి హామీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహించే భారత్‌బంద్‌లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు.

మరో సాయుధ పోరాటానికి సిద్ధం కావాలి: మల్లు స్వరాజ్యం

ఈ దేశ సంపదను కార్పోరేట్ శక్తులకు, భూస్వాముల ప్రయోజనాలకు కట్టబెట్టాలని చూస్తున్న పాలకుల విధానాలకు వ్యతిరేకంగా ఈ దేశంలో మరో సాయుధ పో రాటాన్ని నిర్వహించాలని తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం అన్నారు. భూ పంపిణీ ద్వారానే పేదల జీవితాల్లో మార్పు వస్తుంది తప్ప ఎన్ని ఓట్ల పథకాలు పెట్టిన ప్రజల జీవితంలో మార్పు రాదన్నారు. ప్రజలకు అనేక వాగ్ధానాలు చేసి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజానీ కానికి ఎలాంటి భరోసా ఇవ్వకపోగా ప్రజలపై అనేక భారాలు మోపుతుందని ఆరోపించారు.

బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ దేశంలో మత విద్వేషాలు రెచ్చగొడుతూ దేశ ఐక్యతను దెబ్బ తీస్తున్నారని ఆరోపించారు. నాడు దొరల దోపిడీ పాలన కు వ్యతిరేకంగా సూర్యాపేట ప్రాంతం అనేక పోరాటాలను ఉద్యమాలను నిర్వ హించిదన్నారు. నాడు వెట్టి చాకిరికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం మూలంగానే వెట్టి చాకిరి రైద్దెందన్నారు. నాటి పోరాట ఫలితంగా నాలుగువేల మంది అమరవీరులు తమ ప్రాణాలను కోల్పోయారని మూడు వేల గ్రామాలు వెట్టి చాకిరి నుంచి విమక్తి అయ్యాయని ఆ పోరాటం మూలంగా 10లక్షల ఎకరాల భూమి పేద ప్రజలకు పంచి ఇవ్వడం జరిగిందన్నారు.

ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి ప్రసంగించగా అంతకు ముందు ఐద్వా రాష్ట్ర మహాసభల ప్రారంభ సూచకంగా ఐద్వా జెండాను తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం ఆవిష్కరించారు. మహిళా ఉద్యమ అమరవీరుల చిత్రపటాలకు ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం దావలే, జాతీయ అధ్యక్షురాలు మాలిని భట్టాచార్య తదితరులు నివాళులర్పించారు.

ఐద్వా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యంను శాలువాతో ఘనంగా సన్మానించారు. గత మహాసభ నుంచి ఈ మహాసభ వరకు వివిధ కారణాల రీత్యా మృతి చెందిన వారందరికీ నివాళుల ర్పిస్తూ ఐద్వా రాష్ట్ర నాయకురాలు సమీనా అఫ్రోజ్ సంతాప తీర్మాణం ప్రవేశపెట్టారు. ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి గత మూడేండ్లుగా ఐద్వా నిర్వహించిన కార్యక్రమాల నివేది కను ప్రవేశపెట్టారు.

ఈ మహాసభలో బత్తుల హేమావతి, కె.ఎన్.ఆశలత, బుద్దవీటి సరళ, ఎం.జ్యోతి, అనురాధలు అధ్యక్షత వహించగా సీఐటీయు రాష్ట్ర కార్యదర్శి ఎం.సాయిబాబా, గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు రవినాయక్, కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్‌బాబు, అఖిల భారత మహిళా సమైక్య రాష్ట్ర నాయకురాలు సృజన, ఐద్వా జాతీ కార్యదర్శి మిరియం దావలే. కేరళ మాజీ ఆరోగ్యమంత్రి ఎన్.పుణ్యవతి, టి.జ్యోతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి రమా, ఐద్వా రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ పాలడుగు ప్రభా వతి, మాచర్ల భారతి, వినోద, అరుణ, జ్యోతి, రత్నమాల, గీత, మహేశ్వరి, లత, లక్ష్మమ్మ, ఐద్వా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జంపాల స్వరాజ్యం, మేకనబోయిన సైదన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement