బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ రీసెంట్గా సూర్య హీరోగా సుధ కొంగర దర్శకత్వం వహించిన ‘సూరరై పోట్రు’ (‘ఆకాశం నీ హద్దురా’) సినిమాపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని ‘కయ్యిలే ఆగాశమ్.. కొండు వంద ఉన్ పాసమ్’ (తెలుగులో ‘అందని ఆకాశం దించవయ్యా మాకోసం’) అనే పాట చాలా మందికి కంట తడి పెట్టించింది. ఈ పాట విని అమితాబ్ కూడా ఎమోషనల్ అయ్యారనే విషయాన్ని రీసెంట్గా తెలియజేశాడు.
ఈ పాట విన్నప్పుడల్లా కన్నీళ్లు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. సూర్య నటించిన ఈ పాటలో గుండె బద్దలు చేసే ఎమోషన్ ఉంది. సహజత్వానికి దగ్గరగా ఉన్న ఈ పాట నా కన్నీళ్లను ఆపలేకపోయింది. ఓ తండ్రీకొడుకు మధ్య ఉండే భావోద్వేగాన్ని ఆవిష్కరించిన పాట ఇది. నాతో ఈ ఎమోషన్ చాలాకాలం ఉండిపోతుంది’’ అని తన బ్లాగ్లో రాసుకొచ్చారు అమితాబ్ బచ్చన్. దీనిపై స్పందించిన సూర్య .. ఇలాంటి అద్భుతమైన మాటలు, ప్రశంసలు లాంటివే తన సినిమా సూరారై పోట్రు కి గ్రేటెస్ట్ రివార్డులు . మీ మాటలు తన మనసుని తాకాయని ఎమోషనల్ గా సూర్య స్పందిస్తూ ధన్యవాదాలు తెలిపారు.