Pethanna teaser | సూపర్ స్టార్ రజినీకాంత్ గత కొద్ది రోజులుగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు తలైవా తన ఫోకస్ అంతా అన్నాత్తే సినిమాపై ఉంచేశాడు. బ్రదర్ సెంటిమెంట్‌తో వస్తున్న ఈ సినిమాలో రజినీ చెల్లెలుగా కీర్తి సురేశ్ నటిస్తుంది. ఈ సినిమాకు శివ దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళంలో వరుసగా అజిత్ హీరోగా సినిమాలు చేస్తూ విజయాలు అందుకున్న శివ.. తొలిసారి రజనీకాంత్ తో పని చేస్తున్నాడు. చాలా సంవత్సరాలుగా రజినీ కూడా పర్ఫెక్ట్ బ్లాక్ బస్టర్ ఇవ్వలేకపోతున్నాడు. అభిమానులకు ఈయన చాలా బాకీ పడిపోయాడు. ఇలాంటి సమయంలో అభిమానుల అంచనాలు అన్నాత్తే సినిమాపైనే ఉన్నాయి. ఈ సినిమాతో కచ్చితంగా సూపర్ హిట్ అందుకుంటామని రజినీ కూడా ధీమాగా ఉన్నాడు. ఎన్నో బ్రేకుల మధ్య అన్నాత్తే సినిమా షూటింగ్ పూర్తి చేశారు. ఇటీవల తమిళంలో విడుదలైన ఈ సినిమా టీజర్లో రజినీ పాత స్టైల్లో కనిపించి మెస్మరైజ్ చేశాడు. ఈ క్రమంలో ఇప్పుడు తాజాగా ఈ సినిమా తెలుగు వర్షన్ పెద్దన్న టీజర్ ను చిత్ర బృందం విడుదల చేసింది.
అన్నాత్తే తెలుగు డబ్బింగ్ వర్షన్‌కు మెగా స్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ టైటిల్ అని పెడతారని మొన్నటిదాకా వార్తలు వచ్చాయి. అదే అన్నయ్య.. 2000 సంవత్సరంలో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. మిలీనియం మొదటి బ్లాక్ బస్టర్‌గా అన్నయ్య చరిత్ర సృష్టించింది. అలాంటి టైటిల్‌ను సినిమాకు పెడితే రజినీకి హిట్ గ్యారంట అని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ ఊహించని విధంగా అన్నాత్తే సినిమా తెలుగు వర్షన్‌కు పెద్దన్న టైటిల్‌ను ఖరారు చేస్తూ దర్శక నిర్మాతలు పోస్టర్లు విడుదల చేశారు. శనివారం విడుదలైన పెద్దన్న టీజర్ ( Pethanna teaser ).. ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. ఈ టీజర్ పక్కా కమర్షియల్ కోణంలో రజినీకాంత్ హీరోయిజాన్ని ఎలివేట్ చేసింది. ఇది చూసి రజినీ ఈజ్ బ్యాక్ అంటూ తలైవా ఫ్యాన్స్ సంబురపడిపోతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
SPB last song | రజినీకాంత్ కోసం ఎస్పీ బాలు పాడిన చివరి పాట వచ్చేసిందిగా..
Rajinikanth: రజనీకాంత్ పోస్టర్‌కి రక్తాభిషేకం.. వైరల్‌గా మారిన వీడియో
దీపావళి రోజు రజనీకాంత్ అభిమానులకు రెండు పండుగలు
అమెరికాలో రజనీకాంత్.. చక్కర్లు కొడుతున్న ఫొటోలు