బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తన అంద చందాలతో కుర్రకారుకు హీటు పుట్టిస్తున్న సన్నీ ప్రస్తుతం ఇటు సౌత్ అటు నార్త్‌లో పలు సినిమాలు చేస్తుంది. అయితే పోర్న్ సినిమాలకు గుడ్ బై చెప్పిన సన్నీ లియోన్ తరువాత ఆ బాలీవుడ్ సినిమాలతో బిజీ అయింది. వాటి ద్వారా లక్షల మంది ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. సోషల్ మీడియాతోను ఈ అమ్మడు అభిమాన గణాన్ని భారీగానే పెంచుకుంటుంది.
మార్చి 29న దేశ వ్యాప్తంగా హోలీ సంబరాలు ఘనంగా జరగగా, ఈ వేడుకను సన్నీ లియోన్ తన ఫ్యామిలీతో కలిసి సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంది. తన భర్త, పిల్లలకు రంగులు పూస్తూ ఆ రంగులలో తాను తడిసి ముద్దైంది. వాటికి సంబంధించిన ఫొటోలను సన్నీ తన సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇవి వైరల్ అయ్యాయి. అయితే ఓ ఫొటోలో రంగులతోనే తన భర్తకు లిప్ లాక్ ఇచ్చిన సన్నీని చూసి హోలీ సంబరాలలోను రొమాన్స్ తగ్గించట్లేదుగా అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.