సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. కృతి శెట్టి నాయికగా నటిస్తున్నది. మైత్రీ మూవీ మేకర్స్, బెంచ్మార్క్ స్టూడియోస్ పతాకాలపై బి. మహేంద్రబాబు, కిరణ్ బల్లపల్లి నిర్మిస్తున్నారు. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకుడు. వినూత్న ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 16న విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ను స్టార్ హీరో మహేష్ బాబు విడుదల చేశారు. ట్రైలర్ బాగుందన్న మహేష్, చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలియజేశారు. లవ్, ఫ్యామిలీ డ్రామాగా సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తున్నది. వైద్యురాలైన కృతి శెట్టి.. హిట్ చిత్రాల దర్శకుడి సినిమాలో నటిస్తే ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా రూపొందించారు. అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : పీజీ విందా, సంగీతం : వివేక్ సాగర్.