వెంకటేశ్ (Venkatesh), వరుణ్ తేజ్ (Varun Tej) కాంబోలో వచ్చిన ఫన్ కామెడీ ఎంటర్ టైనర్ ఎఫ్3 (F3). టాలీవుడ్ (Tollywood) స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి థియటర్లకు వచ్చే ప్రేక్షకులకు పక్కా ఎంటర్టైన్ మెంట్ అందిస్తున్నాడు. తమన్నా, మెహరీన్ కౌర్ , రాజేంద్రప్రసాద్, అలీ, రఘుబాబు, ప్రగతి, సోనాల్ చౌహాన్, అన్నపూర్ణమ్మ, మురళీ శర్మ..ఇలా ప్రతీ ఒక్కరూ ఎఫ్ 3 ఫన్ రైడ్‌లో భాగస్వామ్యమయ్యారు. ఎఫ్ 3 సినిమాపై ఇద్దరు స్టార్ సెలబ్రిటీలు ప్రశంసలు కురిపించారు.
ఎఫ్ టీంకు అభినందనలు తెలియజేశారు. ఇంతకీ ఆ ఇద్దరు సెలబ్రిటీలెవరో తెలుసా..? ఒకరు నందమూరి బాలకృష్ణ (Balakrishna). మరొకరు కామెడీ లెజెండ్ బ్రహ్మానందం (Brahmanandam). బ్రహ్మానందం సినిమా చూసి ఎఫ్ 3 చిత్రయూనిట్‌ను ప్రశంసించారు. వెంకీ అండ్ టీంతో ఇంటర్వ్యూలో కూడా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా వెంకీ, అలీ, అనిల్ రావిపూడి, వరుణ్ తేజ్ కామెడీ లెజెండీ బ్రహ్మీని హ్యాపీ మూడ్‌లో హత్తుకున్న స్టిల్ ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
మరోవైపు బాలకృష్ణ ప్రసాద్ ల్యాబ్స్ లో ఎఫ్ 3 స్పెషల్ స్క్రీనింగ్‌కు హాజరయ్యాడు. ఎఫ్ 3ను చూసిన తర్వాత అనిల్ రావిపూడి, నిర్మాత శిరీష్‌తో బాలకృష్ణ కలిసి దిగిన ఫొటో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇక సినిమా చూసి చాలా ఇంప్రెస్ అయ్యాడట బాలయ్య. కామెడీ టైమింగ్ చాలా బాగుందని ప్రశంసించినట్టు సమాచారం.