e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 16, 2021
Home News ప‌ర‌మేశ్వ‌రుడి బొమ్మ‌ను అందంగా గీసిన శ్రీముఖి

ప‌ర‌మేశ్వ‌రుడి బొమ్మ‌ను అందంగా గీసిన శ్రీముఖి

ప‌ర‌మేశ్వ‌రుడి బొమ్మ‌ను అందంగా గీసిన శ్రీముఖి

అశేష అభిమాన గ‌ణం  సంపాదించుకున్న బుల్లితెర యాంక‌ర్స్‌లో శ్రీముఖి ఒక‌రు. బిగ్ బాస్ షోతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ప్ర‌స్తుతం సినిమాలు కూడా చేస్తుంది. క్రేజీ అంకుల్ అనే సినిమాలో శ్రీముఖి న‌టించ‌గా, ఈ సినిమా మ‌రి కొద్ది రోజుల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.  శ్రేయాస్ మీడియా నిర్మిస్తోన్న ఈ మూవీ మ‌నీ ఫేం డైరెక్ట‌ర్ శివ‌నాగేశ్వ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కింది. ప్ర‌ముఖ గాయ‌కుడు మ‌నో, ర‌ఘుకుంచె , రాజా ర‌వీంద్ర కీల‌క పాత్ర‌లో న‌టించారు.

శ్రీముఖి ఇటు బుల్లితెర అటు వెండితెరపైనే కాకుండా  సోష‌ల్ మీడియాలోను  తెగ సంద‌డి చేస్తుంటుంది. ఈ మ‌ధ్య హాట్ హాట్ పిక్స్ షేర్ చేసి హీటెక్కించిన శ్రీముఖి  శివ‌రాత్రి సంద‌ర్భంగా షాకింగ్ విష‌యం చెప్పి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. జాగ‌ర‌ణ చేసిన తాను శివుని బొమ్మ‌ను అద్భుతంగా గీసాన‌ని చెబుతూ అందుకు సంబంధించిన ఫొటోని సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ప్ర‌స్తుతం శ్రీముఖి షేర్ చేసిన పిక్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. 

Advertisement
ప‌ర‌మేశ్వ‌రుడి బొమ్మ‌ను అందంగా గీసిన శ్రీముఖి
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement