శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘అల్లూరి’. ‘నిజాయితీకి మారుపేరు’ ఉపశీర్షిక. ప్రదీప్వర్మ దర్శకుడు. బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీవిష్ణు పోలీస్ ఆఫీసర్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నారు. సెప్టెంబర్ 23న విడుదల కానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో శ్రీవిష్ణు ఈటె పట్టుకొని పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు. వ్యవస్థలోని అన్యాయాలు, అక్రమాలపై ఓ సిన్సియర్ పోలీసాఫీసర్ చేసిన పోరాటం ఏమిటన్నదే చిత్ర కథాంశమని దర్శకుడు తెలిపారు. ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్‌కు మంచి స్పందన లభిస్తున్నదని నిర్మాత పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రాజ్ తోట, సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, రచన-దర్శకత్వం: ప్రదీప్ వర్మ.