e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home News కుళ్లిన తర్వాతే తినే ఈ పండు ప్రత్యేకత గురించి తెలుసా...?

కుళ్లిన తర్వాతే తినే ఈ పండు ప్రత్యేకత గురించి తెలుసా…?

కుళ్లిన తర్వాతే తినే ఈ పండు ప్రత్యేకత గురించి తెలుసా...?

హైదరాబాద్, జూన్ 25: ప్రపంచంలో లభించే పండ్లలో ఒక్కో పండుదీ ఒక్కో ప్రత్యేకత. అలాగే ఈ పండుకూ ఓ ప్రత్యేకత ఉన్నది. దీనిని కుళ్లిన తర్వాత మాత్రమే తినడానికి పనికొస్తుంది. వీటిని మెడ్లర్ ఫ్రూట్ అంటారు. ఇవి చెట్టు నుంచి తీసేటప్పుడు పచ్చగా,గోధుమ రంగులో ఉంటాయి. అస్తవ్యస్తంగా ఉన్న ఉల్లిపాయ ఆకారంలో ఉంటాయి.వీటిని నేరుగా తింటే తీవ్ర అస్వస్థతకు గురయ్యే ప్రమాదం ఉందని 18వ శతాబ్దపు వైద్యులు పేర్కొన్నారు. కానీ వీటిని కొన్ని వారాలపాటు మగ్గబెట్టి కుళ్లిన తర్వాత తింటే మంచిదని చెప్పారు. వీటి రుచి కాల్చిన ఆపిల్‌లా ఉంటుంది. ఈ పండులో అంతు చిక్కని రసాయన చర్య జరుగుతుంది.

ఈ పండులో ఉండే ఎంజైములు క్లిష్టమైన కార్బోహైడ్రేట్‌లను తేలికపాటి చక్కెరలాగా ఫ్రక్టోజ్, గ్లూకోజ్‌గా మారుస్తుంది. అందుకే ఇందులో మాలిక్ ఆమ్లం ఎక్కువగా ఉంటుంది. దీని వల్లే వీటికి పుల్లటి రుచి వస్తుంది.ఈ ప్రక్రియనే బ్లేట్టింగ్ అని అంటారు. ఈ పదాన్ని1939లో ఒక బోటనిస్ట్ కనిపెట్టారు.ఈ ప్రక్రియ వల్ల దీనికి బాగా పండిన కర్జూరాన్ని నిమ్మకాయలతో కలిపితే వచ్చే రుచి వస్తుంది. “ఇవి బాగా మగ్గినప్పుడు తినడానికి బాగుంటాయి” అని 2015లో నార్ఫోక్ పండ్ల తోటలో 120 మెడ్లర్ చెట్లను నాటిన జేన్ స్టెవార్డ్ అనే వృక్షాప్రేమికుడు చెప్పారు. బ్రిటన్‌లో భారీ స్థాయిలో జరిగిన ఈ చెట్ల సేకరణ ఇదే అని చెప్పవచ్చు. ఈ ఫలం అందరికీ నచ్చాలనే నియమం ఏమి లేదు.”మెడ్లర్ ఒక కుళ్లిన ఆపిల్ కంటే రుచిగా ఉంటుంది” అని మధ్యయుగం నాటి ఒక ప్రచురణలో రాశారు.

కుళ్లిన తర్వాతే తినే ఈ పండు ప్రత్యేకత గురించి తెలుసా...?
- Advertisement -

మెడ్లర్ ఎక్కడ పుట్టిందో తెలియదు. కానీ దీనిని వేలసంవత్సరాల క్రితం పశ్చిమాసియాలో కాస్పియన్ సముద్ర తీరంలో పెంచారని కొందరు చెబుతారు.ఇప్పటికీ వీటి రకాలు ఆ ప్రాంతంలో కనిపిస్తాయి.ఈ చెట్టును ఆపిల్, గులాబీ, సీతాఫలానికి దగ్గరగా ఉండే జాతిగా చెబుతారు.కింద భాగంలో వంగిన కొమ్మలు, పైభాగంలో అందంగా అల్లిన దట్టమైన ఆకులు ఉండి ఈ చెట్టు అందంగా కనిపిస్తుంది. వసంత కాలంలో నక్షత్ర ఆకారంలో ఉండే పువ్వులు పూస్తాయి. శరత్కాలం వచ్చే సరికి పచ్చగా, ఎరుపు, గోధుమ రంగుల సమ్మేళనంతో కనువిందు చేస్తుంది. ఈ చెట్లు చాలా అసాధారణమైనవి. ఇవి డిసెంబరులోమాత్రమే కాస్తాయి.

కుళ్లిన తర్వాతే తినే ఈ పండు ప్రత్యేకత గురించి తెలుసా...?

2011లో టాస్గేటియం అనే గ్రామంలో పురావస్తు శాఖ తవ్వకాలు జరుపుతోంది. రైన్ నదిపై నిర్మితమైన ఈ గ్రామాన్ని పూర్వకాలంలో సెల్టిక్ అనే రాజు పరిపాలించేవాడు. జూలియస్ సీజర్ ఈ ప్రాంతాన్ని స్వయంగా సెల్టిక్ రాజుకు బహుకరించారు. ఇదిప్పుడు స్విట్జర్లాండ్‌లో ఉంది. ఆ గ్రామంలోని ఒక రోమన్ టాయిలెట్‌లో పురావస్తుశాఖ అధికారులకు అంతుచిక్కని అసాధారణ విత్తనాలు దొరికాయి. ప్లమ్స్, చెర్రీలు, పీచెస్, వాల్‌నట్ వంటి వాటి మధ్యలో పురావస్తు శాస్త్రవేత్తలకు 19 పెద్ద విత్తనాలు దొరికాయి. వీటిని కనీసం రెండువేలసంవత్సరాల క్రితం భద్రపరచి ఉంటారని భావిస్తున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కుళ్లిన తర్వాతే తినే ఈ పండు ప్రత్యేకత గురించి తెలుసా...?
కుళ్లిన తర్వాతే తినే ఈ పండు ప్రత్యేకత గురించి తెలుసా...?
కుళ్లిన తర్వాతే తినే ఈ పండు ప్రత్యేకత గురించి తెలుసా...?

ట్రెండింగ్‌

Advertisement