ఎయిర్ డెక్కన్ సంస్థ అధినేత గోపినాథ్ జీవితగాధ ఆధారంగా.. సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్ర సూరరై పోట్రు. సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తెలుగులో ‘ఆకాశమే నీ హద్దురా’ పేరుతో విడుదల అయింది. 2డీ ఎంటర్టైన్మెంట్స్, సిఖ్యా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై ఈ సినిమాను నిర్మించారు. కరోనా కారణంగా గత ఏడాది నవంబర్లో ఓటీటీలో విడుదలైన ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది. చిత్రంలో అపర్ణ బాలమురళీ హీరోయిన్గా నటించింది.
సూరరై పోట్రు చిత్రం అనేక ఘనతలు సాధించింది. ఆస్కార్ పోటికి కూడా వెళ్లింది. చివరికి నిరాశను మిగిల్చింది. అయితే ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయాలని సూర్య భావించారు. అబున్డంటియా ఎంటర్టైన్మెంట్ సంస్థతో కలిసి హిందీలో రీమేక్ చేయాలని భావించగా, అందుకు సిఖ్యా ఎంటర్టైన్మెంట్ సంస్థ చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
కెప్టెన్ గోపీనాథ్ బయోపిక్ ఆధారంగా రచించిన సింప్లిఫై పుస్తక హక్కులు తమకు చెందినవని, హైకోర్ట్ పిటీషన్ వేయడంతో దీనికి ప్రతిగా 2డి ఎంటర్టైన్మెంట్ సంస్థ చెన్నై హైకోర్టులో రిట్ పిటిషన్ వేసింది. వాదనల అనంతరం న్యాయమూర్తి 2డీ ఎంటర్టైన్మెంట్ సంస్థకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. దీంతో త్వరలోనే హిందీ రీమేక్ రూపొందనుంది.