కరోనా కష్టకాలంలో ఆపద్భాందుడిలా చేతిక ఎముక లేదన్నట్టు సాయం చేసుకుంటూ వెళ్లారు నటుడు సోనూసూద్. ఆయన చేసిన సేవలు ఒకటి రెండు కావు. వలస కార్మికుల దగ్గర నుండి విదేశాలలో ఉన్న భారతీయుల వరకు ప్రతి ఒక్కరికి సాయం చేసుకుంటూ వెళ్లారు. ఆయన చేసిన సేవలకు గౌరవంగా దేశీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్ బోయింగ్ 737 విమానం మీద సోనూ సూద్ బొమ్మను వేశారు. అంతే కాక ఆపద్భాందవుడికి సెల్యూట్ అని రాసింది.
తనకు దక్కిన అరుదైన గౌరవంపై సోనూసూద్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. “మొగా నుండి ముంబైకి రిజర్వేషన్ లేకుండా వచ్చాను. ఇప్పుడు నాకు ఇలాంటి గుర్తింపు వచ్చేలా చేసిన మీ అందరికి ధన్యవాదాలు. నా తల్లిదండ్రులను మరింత మిస్ అవుతున్నాను. అని తన ట్వీట్లో పేర్కొన్నారు .2007 లో తన తల్లి సరోజ్ సూద్‌ను కోల్పోయారు సోనూసూద్ .ఇక తండ్రి శక్తి సూద్ 2016 లో మరణించారు.