e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home News మంచు చిరుత‌ను చూశారా ? హైద‌రాబాదీ ఫోటోగ్రాఫ‌ర్ ఫోటోకు తెగ లైక్‌లు

మంచు చిరుత‌ను చూశారా ? హైద‌రాబాదీ ఫోటోగ్రాఫ‌ర్ ఫోటోకు తెగ లైక్‌లు

మంచు చిరుత‌ను చూశారా ? హైద‌రాబాదీ ఫోటోగ్రాఫ‌ర్ ఫోటోకు తెగ లైక్‌లు

హైద‌రాబాద్‌: వైల్డ్‌లైఫ్ ఫోటోగ్ర‌ఫీ ఓ క‌ళ‌. అడ‌వుల్లో జంతువులను ఫోటోలు తీయ‌డం ఒక ఎత్తు. ఇక హిమాల‌యాల్లో మంచు చిరుతల‌ను షూట్ చేయ‌డం మ‌రో ట్యాలెంట్‌. హైద‌రాబాదీకి చెందిన ఫోటోగ్రాఫ్ ఇస్మాయిల్ ష‌రీఫ్‌కు ఫోటోగ్ర‌ఫీ ప్రాణం. హిమాల‌యాల్లో ఉన్న జంతువులను షూట్ చేయ‌డం అత‌నికి మ‌రీ ఇష్టం. దాని కోసం ప్ర‌తి ఏడాది టూర్ కూడా వేస్తుంటాడు. ఓసారి త‌న టీమ్‌తో క‌లిసి ల‌డాఖ్ టూర్ వెళ్లాడు. కార్గిల్‌లోని ద్రాస్ వ‌ద్ద అత‌ను బ్రేక్ తీసుకున్నాడు. ఆ స‌మ‌యంలో ఓ మంచు చిరుత త‌న కెమెరాకు చిక్కింది. స‌మీపంలో ఉన్న గ్రామానికి తిండి కోసం వ‌చ్చిన ఆ స్నో చిరుత‌న త‌న కెమెరాలో బంధించిన తీరు అద్భుతం. వైల్డ్‌లైఫ్ ఫోటో వెబ్‌సైట్ల‌లో ఆ ఫోటోను ఇస్మాయిల్ పోస్టు చేశాడు. 2017లో తీసిన ఆ ఫోటో ఇప్ప‌టికీ ట్రెండింగ్ అవుతోంది. హిమాల‌య ప‌ర్వ‌త శ్రేణుల్లో.. సేద తీరుతున్న ఆ చిరుత ఫోటోకు 12 వేల షేర్లు, 58 వేల లైక్‌లు వ‌చ్చాయి. తాను తీసిన ఫోటోకు ఆన్‌లైన్‌లో ఇంత ఆద‌ర‌ణ ల‌భించ‌డం అత‌న్ని ఆనందానికి గురి చేసింది.

మంచు చిరుత‌ను చూశారా ? హైద‌రాబాదీ ఫోటోగ్రాఫ‌ర్ ఫోటోకు తెగ లైక్‌లు

ఇవాళ ఎర్త్ డే. ఈ నేప‌థ్యంలో ఇస్మాయిల్ తీసిన ఆ ఫోటోను గుర్తు చేసుకోవాల్సి వ‌చ్చింది. 2014 నుంచి మంచు చిరుత‌ల‌ను షూట్ చేస్తున్న‌ట్లు ఇస్మాయిల్ తెలిపాడు. హిమాల‌య రాళ్ల మ‌ధ్య సేద తీరుతున్న చిరుత ఫోటో త‌న‌కు ప్ర‌త్యేక‌మైంద‌న్నాడు. స్పిటీ వ్యాలీకి తాను రెగ్యుల‌ర్‌గా వెళ్తుంటాని అత‌ను చెప్పాడు. స్నో లియోపార్డ్స్‌ను షూట్ చేసేందుకు ప్ర‌తి ఏడాది అక్క‌డ‌కు విజిట్ చేస్తున్న‌ట్లు అత‌ను తెలిపాడు. గ‌త ఏడాది లాక్‌డౌన్‌కు ముందు 2020 ఫిబ్ర‌వ‌రిలో హిమాల‌యాల‌కు వెళ్లిన‌ట్లు చెప్పాడు. కానీ దుర‌దృష్ట‌వ‌శాత్తు త‌న హార్డ్ డిస్క్ క్రాష్ కావ‌డం వ‌ల్ల చిరుత ఫోటోల‌ను తీయ‌లేక‌పోయిన‌ట్లు తెలిపాడు.

ద‌ట్ట‌మైన మంచులో దాగి ఉండే చిరుత‌ను గుర్తించ‌డం అంత ఈజీ కాదు. దానికి చాలా శిక్ష‌ణ అవ‌స‌రం అని ఇస్మాయిల్ చెప్పాడు. తీక్ష‌ణ‌మైన చూపు ఉంటేనే.. స్మోలో చిరుతలు క‌నిపిస్తాయ‌న్నాడు. అడ‌వుల్లో ఉండే చిరుత‌ల క‌న్నా.. మంచుల్లో ఉండే చిరుత‌లు చిన్న సైజులో ఉంటాయి. కానీ వాటిల్లో ఉన్న బూరు వ‌ల్ల అవి పెద్ద‌గా క‌నిపిస్తాయ‌ని ఫోటోగ్రాఫ‌ర్ తెలిపాడు. మంచు చిరుత ఉద‌రం వ‌ద్ద బొచ్చు వెడల్పు సుమారు 12 ఇంచులు ఉంటుంది. దాని శ‌రీరం ఎంత పొడుగు ఉంటుందో.. తోక కూడా అంత ఉంటుంద‌ట‌. అయితే ఒక‌ప్పుడు తాను తీసిన స్నో చిరుత ఫోటో ఇప్పుడు వెబ్‌సైట్ల‌లో మ‌ళ్లీ క‌నిపించ‌డం భార‌త్‌లో వైల్డ్‌లైఫ్ ప‌ట్ల ఎంత ఆస‌క్తి ఉందో చెబుతోంద‌న్నారు. ఫోటోకు వ‌చ్చిన కామెంట్స్ చూస్తే.. ఆన్‌లైన్ క్లాసులు తీసుకోవాల‌న్న ప‌ట్టుద‌ల పెరిగింద‌న్నాడు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మంచు చిరుత‌ను చూశారా ? హైద‌రాబాదీ ఫోటోగ్రాఫ‌ర్ ఫోటోకు తెగ లైక్‌లు

ట్రెండింగ్‌

Advertisement