e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 27, 2021
Home News ఆ జిల్లాలో పాముల బెడద: మూడురోజుల్లో 21మందిని కాటు వేసిన సర్పాలు…

ఆ జిల్లాలో పాముల బెడద: మూడురోజుల్లో 21మందిని కాటు వేసిన సర్పాలు…

అమరావతి, ఆగస్టు : కృష్ణా జిల్లాలోని దివిసీమ ప్రాంత ప్రజలను పాములు హడలెత్తిస్తున్నాయి. మూడు రోజుల్లోనే 21 మంది పాముకాటుకు గురయ్యారు. దివిసీమ ప్రాంతంలో తాజాగా పాముకాటుకు ఓ రైతు బలయ్యాడు. నాగాయలంక మండలం నంగేగడ్డ గ్రామానికి చెందిన ఓ రైతును మంగళవారం పాము కాటేసింది. దాంతో వెంటనే స్థానికులు బాధితుడ్ని అవనిగడ్డ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా…దురదృష్టావశాత్తు మార్గం మధ్యలోనే ప్రాణాలు వదిలాడు. గత మూడు రోజుల్లో దాదాపు 21 మంది పాముకాటుకు గురయ్యారు. పామర్రు, మొవ్వ, అవనిగడ్డ ప్రాంతాల్లో పాముకాటు కేసులు అధికంగా నమోదు అవుతున్నాయి. దాంతో ఈ ప్రాంతాల్లో ప్రజలు భయభ్రాంతులకు గురువుతున్నారు. ప్రతీ ఏటా ఖరీఫ్ సీజన్‌లో దివి సీమ ప్రాంతంలో ఎంతో మంది రైతులు పాము కాటుకు బలైపోతున్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana