Smart bandage | ఆఫీసు పనిమీద బైక్‌పై వెళ్తున్న కమలాకర్‌కు ఇటీవల ఓ చిన్న యాక్సిడెంట్ అయింది. చేతికి గాయమై రక్తస్రావం కావడంతో వైద్యులు బ్యాండేజీతో కట్టుకట్టారు. ఐదురోజులైంది. గాయం నయమైందో.. లేదోనని చూసేందుకు డాక్టర్లు కట్లు విప్పారు. అయితే, ఇంకా గాయం మానలేదు. దీంతో మళ్లీ వేరే పట్టీ కట్టారు. బ్యాండేజీ విప్పడం, మళ్లీ కట్టడంతో కమలాకర్‌కు శారీరకంగా ఎంతో బాధ కలిగింది. ఇలాంటి పరిస్థితులకు చెక్ పెడుతూ ఇటలీలోని యూనివర్సిటీ ఆఫ్ బోలోగ్నా పరిశోధకులు ‘స్మార్ట్ బ్యాండేజీ’ని అభివృద్ధి చేశారు.
గాయంలోని తేమ శాతాన్ని అంచనావేయడాన్ని బట్టి ఈ ‘స్మార్ట్ బ్యాండేజీ’ పనిచేస్తుంది. తేమ అంచనా కోసం బ్యాండేజీలో ప్రత్యేకంగా ఓ సెన్సర్ ఉంటుంది. అంచనా వేసిన తేమ శాతాన్ని రేడియో-ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) చిప్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు సందేశాన్ని పంపిస్తుంది. తేమ శాతం జీరోగా నమోదైతే, గాయం మానినట్టు భావించవచ్చు. రక్తస్రావ గాయాలు, కాలిన గాయాలు, బొబ్బలు వంటివాటికి ఇది చక్కగా పనిచేస్తుందని పరిశోధకులు తెలిపారు. అత్యంత చవకైన ఈ స్మార్ట్ బ్యాండేజీ.. ఎప్పుడు మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుందన్న విషయాన్ని ఇంకా వెల్లడించలేదు.
బ్యాండేజీని తొలగించకుండానే.. ఫోన్ మెసేజ్ ద్వారా గాయం నయమైందో లేదో వైద్యులకు తెలియజేసే అధునాతన పట్టీనే ‘స్మార్ట్ బ్యాండేజీ’.
విరిగిన ఎముకలను అతుక్కునేలా చేసే బయోడీగ్రేడబుల్ బ్యాండేజీని లండన్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఎముకల్లో ఉండే ప్రొటీన్లు, స్టెమ్ సెల్స్‌కు ఒక ప్రత్యేక పాలిమర్‌ను జతచేసి ఈ బ్యాండేజీని తయారు చేశామన్నారు. వెంట్రుకతో పోలిస్తే మూడు రెట్లు మందంగా ఉండే ఈ బ్యాండేజీని ఎముకలు విరిగిన ప్రదేశంలో కడితే.. కొన్ని రోజులకు బ్యాండేజీ శరీరంలో కలిసిపోయి విరిగిన ఎముకలను నయం చేస్తుందని పరిశోధకులు తెలిపారు. ఎలుకల పుర్రెలపై చేసిన ప్రయోగాల్లో ఇది సత్ఫలితాలనిచ్చినట్టు చెప్పారు. అమెరికా ఎఫ్‌డీఏ అనుమతించిన పాలీకాప్రోలాక్టోన్ అనే పాలిమర్‌ను ఈ బ్యాండేజీ తయారీలో వాడినట్టు వివరించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఆ ఉల్లిగడ్డలను తిని జనాలు ఎందుకు జబ్బుపడుతున్నారు? వాటిలో ఏముంది?
ఈ పండు రోజూ తింటే హార్ట్ అటాక్ రాదంట..! ఆక్స్ఫర్డ్ పరిశోధకుల వెల్లడి
Six Pack : సిక్స్ ప్యాక్ బాడీ అందరికీ సాధ్యం కాదా? జీన్స్‌తో సంబంధముంటుందా?
WhatsApp : మీ నెంబర్ కే వాట్సప్ మెసేజ్ పంపించుకోవడం ఎలా? ముఖ్యమైన సమాచారం ఉంటే ఇలా షేర్ చేసుకోండి