ముంబై,జూన్ 28: స్కోడా బ్రాండ్ కొత్త ‘కుషాక్’ ఎట్టకేలకు దేశీయ మార్కెట్లోకి విడుదలైంది. కుషాక్ కోసం బుకింక్స్ ప్రారంభమయ్యాయి. కుషాక్ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు ఆన్లైన్లో లేదా భారతదేశం అంతటా డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు. స్కోడా కుషాక్ ధర రూ. 10.49 లక్షలు. కాగా ఈ ఎస్యూవీ వెహికల్స్ డెలివరీ జూలై 12 నుంచి ప్రారంభం కానున్నాయి. స్కోడా తన కుషాక్ ఎస్‌యూవీని మూడు వేరియంట్లలో లభ్యమవుతున్నాయి.
అవేంటంటే యాక్టివ్, అంబిషన్, స్టైల్ వేరియంట్లు ఉన్నాయి. స్కోడా కుషాక్ ను ఎక్సెలెంట్ డిజైన్ తో రూపొందించారు. ఈ ఎస్యూవీ ముందు భాగంలో ఐకానిక్ ఫ్రంట్ గ్రిల్ ఉంటుంది. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడీ ఫాగ్ లాంప్స్, ఎల్ఈడీ టెయిల్ లైట్లు ఉన్నాయి. కారు ముందు భాగంలో పెద్ద ఎయిర్ డ్యామ్ ,నిలువుగా ఉన్న బోనెట్ వస్తుంది. షార్క్ ఫిన్ యాంటెన, రియర్ వైపర్ , బిగ్ రియర్ బంపర్ ఉన్నాయి. ఈ ఎస్‌యూవీలో అల్లాయ్ వీల్స్, రూఫ్ రైల్స్, సన్‌రూఫ్ వంటివి ఉంటాయి.