హను రాఘవపూడి (Hanu Raghavapudi) డైరెక్షన్లో వార్ బ్యాక్ డ్రాప్లో సాగే పీరియాడిక్ ప్రేమకథతో వస్తున్న చిత్రం సీతారామమ్ (Sita Ramam). ఆగస్టు 5న థియేటర్లలో సందడి చేయనుంది. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) హీరోగా నటిస్తుండగా..బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur), రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు.
ఇప్పటికే ప్రమోషన్స్ లో బిజీగా ఉంది టీం. కాగా సినిమా కోసం ఎదురుచూస్తున్న సినీ లవర్స్ ను దృష్టిలో పెట్టుకుని టికెట్ ధరలను నిర్ణయించారు మేకర్స్. తాజా అప్ డేట్ ప్రకారం టికెట్ల ధరల వివరాలిలా ఉన్నాయి..
సింగిల్ స్క్రీన్స్ థియేటర్లు : రూ.147 (ఏపీ), రూ.150 (టీఎస్) జీఎస్టీతో కలిపి
మల్టీప్లెక్స్ థియేటర్లు : రూ.177 (ఏపీ), రూ. 195 (టీఎస్) జీఎస్టీతో కలిపి
తాజా నిర్ణయించిన రెగ్యులర్ టికెట్స్ ధరలు, సినిమా కంటెంట్ థియేటర్లకు జనాలను తీసుకొస్తుందని ధీమాగా ఉన్నారట మేకర్స్. ఈ చిత్రంలో బ్రిగేడియర్ విష్ణు శర్మగా సుమంత్ అక్కినేని నటిస్తుండగా..అతడి భార్యగా భూమిక చావ్లా నటిస్తోంది. పెళ్లి చూపులు డైరెక్టర్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ బాలాజీ పాత్రలో నటిస్తుండగా, రష్మిక కశ్మీరీ యువతి అఫ్రీన్ పాత్రలో కనిపించనుంది. ప్రకాశ్‌రాజ్ మరో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ బ్యానర్‌పై స్వప్న దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ డైరెక్టర్. సీతారామం తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది.