e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, October 24, 2021
Home News మరింత విశాలంగా మహామండపం

మరింత విశాలంగా మహామండపం

కొమురవెల్లి క్షేత్రంలో మహామండప విస్తరణకు చర్యలు
రూ.2.75కోట్లతో ప్రతిపాదనలు
రూ.25 లక్షలతో విజయగణపతి ఆలయ నిర్మాణం
దేవాదాయ శాఖకు ప్రతిపాదనలు పంపిన ఆలయవర్గాలు
అనుమతి రాగానే పనులు షురూ

చేర్యాల, మార్చి 19 : కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి భక్తులకు మరిన్ని వసతులు కల్పించేందుకు ఆలయవర్గాలు చర్యలుతీసుకుంటున్నాయి. మల్లన్న ఆలయ నిధులు రూ. 2.75 కోట్ల వ్యయంతో మహామండపాన్ని విస్తరించేందుకు ఆలయ ఈవోఏ. బాలాజీ ప్రతిపాదనలు తయారు చేయించి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన గ్రీన్‌సిగ్నల్ఇచ్చారు. మండప విస్తరణతో పాటు ఆలయ నైరుతి భాగంలో రూ.25లక్షల వ్యయంతో విజయ గణపతి ఆలయ నిర్మాణప్రతిపాదనల నివేదికలను రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్‌కు అందజేశారు. రోజురోజుకూ పెరుగుతున్న భక్తుల సంఖ్యకుఅనుగుణంగా ఆలయంలో వసతులు కల్పించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుం టున్నది. దేవాదాయ శాఖ కమిషనర్ప్రతిపాదనలను పరిశీ లించి ఆమోదించగానే టెండర్లు పిలిచి పనులను త్వరితగతిని పూర్తి చేసేందుకు ఆలయ అధికారులురంగం సిద్ధం చేశారు. వచ్చే బ్రహ్మోత్సవాలకు మహామండప విస్తరణ పనులు పూర్తి చేయాలనే కృతనిశ్చయంతో ఆలయవర్గాలుఉన్నాయి.
భక్తులకు తప్పనున్న తిప్పలుమల్లన్న ఆలయంలోని ప్రస్తుత మహా మండపంలో స్వామి వారి నిత్య కల్యాణం చేసేందుకు అటు అర్చకులు, ఇటు భక్తులు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. దీంతోపాటు స్వామి వారి బ్రహ్మోత్సవాలతో పాటు ఆదివారం రోజుల్లో పట్నాలు వేసేందుకు ఒగ్గుపూజారులు సైతం ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. మల్లన్న ఆలయానికి వేలాదిగా భక్తులు వచ్చి, నిత్య కల్యాణం మొక్కుతోపాటు ముఖమండప పట్నం వేసి మొక్కులు తీర్చుకునేందుకు మండపానికి వెళితే, అక్కడ ఖాళీ ప్రదేశం లేక గంటల పాటువేచి ఉండాల్సి వస్తున్నది. ఇక బ్రహ్మోత్సవాల సమయంలో ఒకరిపై ఒకరు కూర్చోవాల్సిన పరిస్థితులు ఉండడంతో దూరప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. భక్తులు, అర్చకులు, ఒగ్గు పూజారుల సమస్యనుపరిష్కరించి భక్తులు మరింత ఆహ్లాదకర వాతావరణంలో తమ మొక్కులు తీర్చుకునేందుకు మండప విస్తరణకుఆలయవర్గాలు శ్రీకా రం చుట్టడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.మండప విస్తరణతో భక్తులకు మేలుమహామండప విస్తరణతో భక్తులకు ఎంతో మేలు జరుగనున్న దని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతమండపం పక్కనే మరో మండపాన్ని నిర్మించడంతో ఓ మం డపంలో స్వామి వారికి నిత్య కల్యాణం, మొక్కుల పూజలు, మరోమండపంలో భక్తులు పట్నాలు వేసుకునే అవకాశం కలుగనున్నది. బ్రహ్మోత్సవాల సమయంలో మండపంలో నిత్య కల్యాణంనిలిపి వేస్తుండగా, ఆ సమస్య కూడా తీర నున్నది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement