బెంగళూరు: అధిష్ఠానం చెప్పినప్పుడే డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారని కర్ణాటక సీఎం సిద్దరామయ్య సోమవారం వెల్లడించారు. డీకేతో బెంగళూరులో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ తర్వాత మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా బదులిచ్చారు. అధిష్ఠానం అపాయింట్మెంట్ ఇచ్చి ఒక నిర్ణయం తీసుకుంటే దానికి తామంతా కట్టుబడి ఉంటామన్నారు. అయితే దీనిపై ఢిల్లీ నుంచి తమకు ఇంకా ఎలాంటి సమాచారం రాలేదన్నారు.
శాసన సభ సమావేశాల కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఐక్యంగా ఉన్నారన్నారు. విపక్షాన్ని తాము సమైక్యంగా ఎదుర్కొంటామని.. తమ మధ్య విభేదాలు లేవని చెప్పారు. బీజేపీ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే దాన్ని ఎదుర్కోవడానికి తాము పూర్తి సంసిద్ధతతో ఉన్నామన్నారు. అధిష్ఠానం చెప్పినట్టు తాము ప్రవర్తిస్తామన్నారు.