ఆటో ఇండస్ట్రీ బాడీ.. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) నూతన అధ్యక్షుడిగా వినోద్ అగర్వాల్ గురువారం ఎన్నికయ్యారు. 2022-23 సంవత్సరానికి సియామ్ అధ్యక్షుడిగా ఉంటారు. వోల్వో ఎచిర్ కమర్షియల్ సీఈవో కం ఎండీగా వినోద్ అగర్వాల్ పని చేస్తున్నారు. మారుతి సుజుకి ఎగ్జిక్యూటివ్ వైస్‌చైర్మన్ కెనిచి అయుకవా వారసుడిగా వినోద్ అగర్వాల్ ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా వినోద్ అగర్వాల్ మాట్లాడుతూ భారత ఆటోమోటివ్ పరిశ్రమ చాలా ఉత్తేజకరమైన పరిస్థితుల్లో ఉందని చెప్పారు. ఈ-మొబిలిటీ, ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ వాడకం, ఇతర టెక్నాలజికల్ అడ్వాన్ష్మెంట్స్, కనెక్టివిటీపై ఫోకస్ చేసిందన్నారు. పర్యావరణ హిత, సురక్షిత వాహనాల తయారీకి ప్రాధాన్యం ఇస్తుందన్నారు.
టాటా మోటార్స్ ఎండీ శైలేష్ చంద్రా.. సియామ్ వైస్‌ప్రెసిడెంట్‌గా, డైల్మర్ ఇండియా కమర్షియల్ వెహికల్స్ ఎండీ కం సీఈవో సత్యకామ్ ఆర్యను కోశాధికారిగా ఎన్నుకున్నారు.