Shruti Haasan | వరుస సినిమాలతో తండ్రికి తగ్గ తనయగా పేరుతెచ్చుకున్నది శ్రుతి హాసన్. గాయనిగా కూడా రాణిస్తూ తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్నది. ‘సలార్’తో ప్రభాస్‌కు జోడీగా ప్రేక్షకుల ముందుకు రానున్నది శ్రుతి. ఈ సందర్భంగా..
‘సలార్’లో ప్రభాస్‌తో నటిస్తున్నారు కదా? ఎలా అనిపిస్తున్నది?
ప్రస్తుతానికి నా పాత్ర గురించి ఎక్కువగా చెప్పలేను. వైవిధ్యమైన క్యారెక్టర్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఈ అవకాశం వచ్చింది. దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో ప్రభాస్‌తో పనిచేయడం ఆనందకరమైన విషయం.
ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టులు?
ఇప్పటికైతే హైదరాబాద్‌లో ‘సలార్’ షూటింగ్లో పాల్గొంటున్నా. ఇంకో రెండు తెలుగు సినిమాల్లోనూ చేస్తున్నా. వాటి వివరాలు ఇప్పుడే చెప్పలేను. బాలీవుడ్లో కథలు వింటున్నా. ఇంకా ఏ సినిమాకూ సంతకం చేయలేదు.
మీ గాత్రం గురించి?
నాకు ఇళయరాజా, ఏఆర్ రెహమాన్ సంగీతం అంటే ఇష్టం. ఐదేండ్ల వయసులో నాన్న (కమల్ హాసన్) సినిమాలో పాడేందుకు ఇళయరాజా సర్ నన్ను పిలిచారు. ఆ తర్వాత కూడా చాలాసార్లు అవకాశం ఇచ్చారు. రెహమాన్‌గారి ‘రంగీలా’, ‘దిల్ సే’ సినిమాల పాటలు నా ఆల్‌టైమ్ ఫేవరెట్. వ్యక్తిగానూ రెహమాన్ చాలా గొప్ప మనిషి. ఆయనతో మాట్లాడితే మ్యూజిక్ క్లాస్‌కు హాజరైనట్టు ఉంటుంది. కొత్త విషయాలు తెలుస్తాయి.
మీ ఆల్బమ్స్..
ఇప్పటికే 50-60 పాటలు పాడాను. అన్ని ఆల్బమ్స్కూ మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే మరొకటి రిలీజ్ చేస్తా. చిన్నప్పటినుంచీ ఇంటికెళ్లగానే పియానో పట్టుకుని కూర్చోవడం నాకు అలవాటు. నేను సినిమాల్లోకి వచ్చినప్పుడు పాటలు కూడా పాడతానంటే వింతగా చూసేవారు. అప్పట్లో మల్టీటాస్కర్స్ అరుదు. ఇప్పుడు, వివిధ కళల్లో ప్రతిభ కనబరిచేవారికి మంచి ప్రోత్సాహం లభిస్తున్నది.
“Shruti Haasan | ఎవరికి నచ్చినట్టో ఉండక్కర్లేదు!”
“Shruti Haasan | నాపై వచ్చే వార్తలను చదవను: శృతిహాసన్”
“మళ్లీ ప్రేమలో పడ్డ శ్రుతి హాసన్.. తానే ప్రపోజ్ చేశానంటూ ఓపెన్ అయిన నటి”
“Shruti Haasan | మాస్ లుక్‌తో మైండ్ బ్లాక్ చేస్తున్న శ్రుతి హాసన్..”