బాలీవుడ్ భామ శ్రద్దాకపూర్ తన బాయ్‌ఫ్రెండ్, సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ఠతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఫొటోలు కొన్ని ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ముంబైలోని ఓ చైనీస్ రెస్టారెంట్ కు రోహన్ తో కలిసి డిన్నర్ డేట్‌కు వెళ్లింది శ్రద్దాకపూర్. బ్లాక్ అండ్ ఫాన్ షేడ్స్ లో ఉన్న ప్యాంట్ షూట్లో ఉన్న శ్రద్దాకపూర్, క్యాజువల్ లుక్‌లో కనిపిస్తున్న రోహన్ శ్రేష్ఠతో కలిసి రెస్టారెంట్ లో నుంచి బయటకు వస్తున్న ఫొటోలు హల్చల్ చేస్తున్నాయి.
శ్రద్దాకపూర్-రోహన్ చిన్ననాటి నుంచి స్నేహితులు. ఈ ఇద్దరూ అప్పడప్పుడూ ముంబైలో సరదాగా షికారు చేస్తూనే ఉంటారు. గత వారం శ్రద్దాకపూర్ కజిన్ బ్రదర్ ప్రియాంక శర్మ వెడ్డింగ్ ఈవెంట్ లో శ్రద్దా-రోహన్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. కాలేజ్ డేస్ నుంచి రోహన్-శ్రద్దాకపూర్ మంచి స్నేహితులు. ఒకవేళ వారిద్దరూ పెళ్లి చేసుకునేందుకు సిద్దమైతే సంతోషకరమైన విషయమని రోహన్ తండ్రి రాకేశ్ శ్రేష్ఠ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.