అభంశుభం తెలియని చిన్నారులపై కామాంధుల కండ్లు పడుతున్నాయి. చాలా సందర్భాల్లో తెలిసిన వారి దుశ్చర్యే ఇది. ఈ తప్పు జరగకుండా ఉండాలంటే, మన పిల్లలకు ఏది గుడ్ టచ్, ఏది బ్యాడ్ టచ్.. అన్నది చెప్పాలి. తాకకూడని చోట ఎవరైనా తడిమితే, భయపడకుండా ‘డోంట్ టచ్ మీ’ అని గట్టిగా అరిచేలా తర్ఫీదు ఇవ్వాలి. ఈ మేరకు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తన ట్విటర్ ఖాతాలో ఓ సూచన పెట్టారు.