కడ్తాల్, మే 18 : అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని, గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఎంపీపీ కమ్లీమోత్యానాయక్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండల కేంద్రంలో ప్రభుత్వ భవనాల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని తెలిపారు. భవనాల నిర్మాణాలకు సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేశామన్నారు. సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందేలా చూడాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు ఆయన సూచించారు. అనంతరం ప్రజాప్రతినిధులు పలు సమస్యలను సభలో ప్రస్తావించారు. ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చి స్వచ్ఛమైన తాగునీరు అందజేస్తున్నప్పటికీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నా రు. మిషన్ భగీరథతో ప్రతి గ్రామానికి, తండాలకు మంచినీళ్లు సరఫరా అవుతుండటంతో గిరిజనులు, మహిళలు సం తోషంగా ఉన్నారన్నారు. తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తున్నదని, ప్రభుత్వంపై ఆరోపణలు మానుకోవాలని సభ్యులకు సూచించారు. సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత
ముఖ్యమంత్రి సహాయనిధి పథకం పేదలకు వరంలా మారిందని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. మండల కేంద్రానికి చెందిన పాపయ్యకు రూ.40 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే అందజేశారు. పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ దశరథ్‌నాయక్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్ మహేందర్‌రెడ్డి, ఎంపీడీవో రామకృష్ణ, ఎంపీటీసీలు లచ్చిరాంనాయక్, శ్రీనివాస్‌రెడ్డి, రాములుగౌడ్, మంజుల, ప్రియ, ఉమావతి, కోఆప్షన్ సభ్యుడు జహంగీర్‌బాబా, సర్పంచ్‌లు తులసీరాంనాయక్, యాదయ్య, కృష్ణయ్య, విజయలక్ష్మి, ఏవో శ్రీలత, పశువైద్యాధికారి భానునాయక్, డీఈఈ జగన్మోహన్రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.