e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, April 19, 2021
Advertisement
Home News 'ఏం చేద్దామ‌నుకుంటున్నావ్‌..వ్య‌వ‌సాయం..'శ్రీకారం ట్రైల‌ర్

‘ఏం చేద్దామ‌నుకుంటున్నావ్‌..వ్య‌వ‌సాయం..’శ్రీకారం ట్రైల‌ర్

'ఏం చేద్దామ‌నుకుంటున్నావ్‌..వ్య‌వ‌సాయం..'శ్రీకారం ట్రైల‌ర్

టాలీవుడ్ యాక్ట‌ర్ శ‌ర్వానంద్ హీరో న‌టిస్తోన్న మూవీ శ్రీకారం. కిశోర్ బి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్ మోహ‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ మూవీ ట్రైల‌ర్ ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ట్రైల‌ర్ ప్రారంభంలో ల‌వ‌ర్ బాయ్ గా క‌నిపిస్తున్న శ‌ర్వానంద్ ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ యూఎస్ బ్రాంచ్‌కు మేనేజ‌ర్ గా అపాయింట్ అవుతాడు. ఏం చేద్దామనుకుంటున్నావ్ అని ముర‌ళీ శ‌ర్మ అడిగితే వ్య‌వసాయం చేద్దామ‌నుకుంటున్నా అని చెప్ప‌డం, ఆ త‌ర్వాత ఊరికొచ్చి వ్య‌వ‌సాయం చేస్తాడు. పొలానికి, ప‌నిముట్టుకీ ఖాలీ లేకుండా సంవ‌త్స‌రం మొత్తం ఏదో ఒక పంట వ‌స్తూనే ఉండేలా చేద్దాం.

ఉమ్మ‌డిగా చేసిన యుద్దాల్లో రాజ్యాలే గెలిచాం. సేద్యం కూడా గెల‌వొచ్చు అంటూ శ‌ర్వానంద్ చెప్పే సంభాష‌ణ‌లు ఆక‌ట్టుకుంటున్నాయి. 14 రీల్స్ ప్ల‌స్‌ బ్యాన‌ర్‌పై రామ్ ఆచంట‌, గోపి ఆచంట ఈ  సినిమాను నిర్మిస్తున్నారు. వాస్త‌వ ఘ‌ట‌న‌ల స‌మాహారంతో వ్య‌వసాయం ప్రాధాన్యాన్ని తెలియ‌జేస్తూ..ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వ‌స్తోంది శ్రీకారం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Advertisement
'ఏం చేద్దామ‌నుకుంటున్నావ్‌..వ్య‌వ‌సాయం..'శ్రీకారం ట్రైల‌ర్

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement