Pathaan First Look | బాలీవుడ్ బాద్షా షారుఖ్ నుండి సినిమా వచ్చి దాదాపు నాలుగేళ్ళు దాటింది. 2018లో వచ్చిన ‘జీరో’ తర్వాత ఇప్పటివరకు ఈయన నుండి మరో సినిమా రాలేదు. షారుఖ్‌ను వెండితెరపై చూడాలని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. నాలుగేళ్ళ గ్యాప్‌ను పూర్తి చేసేందుకు షారుఖ్ మూడు సినిమాలను సెట్స్‌పై ఉంచాడు. ప్రస్తుతం ఈయన నటించిన పఠాన్ షూటింగ్‌ను పూర్తి చేసుకుని పోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా శనివారంతో షారుఖ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 30 సంవత్సరాలు అయింది. 1992 జూన్ 15న షారుఖ్ ‘దివానా’ సినిమా విడుదలైంది.
ముప్పై సంవత్సరాల నటన జీవితంలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు, ఎన్నో ఇండస్ట్రీ హిట్లు చూశాడు. కాగా 30ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో షారుఖ్ ‘పఠాన్’ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నాడు. ఈ పోస్టర్లో షారుఖ్ చేతిలో గన్ పట్టుకుని నిల్చొని ఇంటెన్సీవ్‌గా చూస్తున్నాడు. మిస్టరీ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో దీపికా పదుకొణె, జాన్ అబ్రహం కీలకపాత్రల్లో నటించారు. ఇదివరకే చిత్రం నుండి విడుదలైన షారుఖ్ 8ప్యాక్ ఫోటో, రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ వీడియో సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. షారుఖ్ ప్రస్తుతం ‘జవాన్’ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తుంది. వీటితో పాటుగా రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో ‘డంకీ’ చిత్రాన్ని చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో షూటింగ్ ప్రారంభించనుంది.
See you next year on 25th Jan, 2023. Celebrate #Pathaan with #YRF50 only at a big screen near you on 25th January, 2023. Releasing in Hindi, Tamil and Telugu. @deepikapadukone | @TheJohnAbraham | #SiddharthAnand | @yrf pic.twitter.com/MUN3XFq5u3
— Shah Rukh Khan (@iamsrk) June 25, 2022