బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో షారుక్‌ఖాన్ (Shah Rukh Khan) 25 రోజుల నిరీక్షణకు తెరపడ్డది. డ్రగ్స్ కేసు (cruise ship drugs case) లో అరెస్టైన ఆర్యన్‌ఖాన్ (AryanKhan) కు పలు సార్లు బెయిల్ తిరస్కరణకు గురవడంతో..మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి టీం రంగంలోకి దిగింది. అక్టోబర్ 28న వాదనలు విన్న ముంబై కోర్టు ఆర్యన్‌కు బెయిల్ మంజూరు చేసింది. శుక్రవారం విడుదల కానున్నాడు ఆర్యన్. తన కుమారుడికి బెయిల్ దొరకడంతో నిద్రాహారాలు మానేసిన షారుక్ ఇంట పండగ వాతావరణం నెలకొంది.
కాగా ఆర్యన్ జైల్లో ఉన్నపుడు షారుక్ పరిస్థితి గురించి చెప్పారు ముకుల్ రోహత్గీ. ఆర్యన్ జైల్లో ఉన్నపుడు షారుక్ ఆ బాధతో సరిగ్గా తినలేదన్నారు ముకుల్. గత మూడు, నాలుగు రోజుల నుంచి షారుక్ చాలా బాధపడుతూ ఉన్నారు. ఆయన సరిగ్గా ఆహారం తీసుకున్నాడని మాత్రం చెప్పలేను. ఆయన కేవలం కాఫీ తర్వాత కాఫీ తాగారు. చాలా బాధలో ఉన్న షారుక్‌ను చివరగా కలిసినపుడు ఆయన ముఖంలో చాలా రిలాక్సేషన్ కనిపించిందంటూ చెప్పుకొచ్చారు ముకుల్ రోహత్గి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Puneeth Rajkumar | బాలనటుడిగా అవార్డులు..స్టార్ హీరోగా రికార్డులు
Puneet Raj Kumar: కర్ణాటకలో హై అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం.. థియేటర్స్ బంద్
Puneet Rajkumar | కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మృతి