బాలీవుడ్ స్టార్ హీరోలు షారుఖ్, సల్మాన్, ఆమిర్ ఖాన్ కలిసి ఓ సినిమాలో నటిస్తే చూడాలన్నది సినీ ప్రియుల కోరిక. అభిమానులు ఈ కాంబినేషన్ సినిమా గురించి ఎంతగా వేచి చూస్తారో చెప్పనక్కర్లేదు. ఈ హీరోలు ఒకరి సినిమాలో మరొకరు నటించారే కానీ ముగ్గురూ కలిసి సినిమా చేయలేదు. ప్రస్తుతం ఈ క్రేజీ కాంబినేషన్ మూవీ కుదిరే అవకాశాలు ఉన్నాయనే మాట వినిపిస్తున్నది. షారుఖ్ ఖాన్ మాట్లాడుతూ…‘మేం కలిసి నటించాలంటే దర్శక నిర్మాతలు ముందు ప్రాజెక్ట్ కోసం సిద్ధమవ్వాలి. మా ఇమేజ్‌లకు తగిన పాత్రలు కుదరాలి. మా ముగ్గుర్నీ భరించగలగాలి. ఎందుకంటే మాలో ఒకరు ప్రశ్న అడిగిన పది నిమిషాలకు జవాబు చెబుతారు. మరొకరు రాత్రి పూట మాత్రమే షూటింగ్ అంటారు. ఇంకొకరు మరో హీరో వచ్చేలోపు సెట్ నుంచి వెళ్లిపోతారు’ అని అన్నారు.