నా వయసు 45 సంవత్సరాలు. ఏడాదిగా సెక్స్‌లో సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో దాంపత్య సుఖం అనుభవించలేకపోతున్నా. భయం, ఆందోళన, ఆత్మన్యూనత పెరిగిపోయాయి. నా స్నేహితుడు వయాగ్రా వేసుకోమన్నాడు. నాలుగు నెలలుగా వాడుతున్నా. సెక్స్‌లో కొంత అనుకూలంగా అనిపించినా వేరే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తున్నది. తీవ్రమైన తలనొప్పి, కండ్ల్లు తిరగడం, మసకబారడటం, అప్పుడప్పుడు ఛాతీలో నొప్పి.. ఇలా రకరకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరో స్నేహితుడికి విషయం చెబితే, వయాగ్రా వాడినప్పుడు తనకూ ఇలాంటి ఇబ్బందులు ఎదరయ్యాయని చెప్పాడు. నన్ను ఆ మాత్రలు కంటిన్యూ చేయమంటారా! మానేయాలా? సంసార సుఖం కోసం ఏం చేయాలో సూచించండి.
వికాస్ (పేరు మార్చాం), మహబూబ్‌నగర్
వయాగ్రా తీసుకున్న తర్వాతే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని మీరే అంటున్నారు. ముందుగా ఆ మందు వాడటం ఆపేయండి. వయాగ్రాలోని సిల్డెన్ ఫిల్ సిట్రేట్‌తో సడన్ హార్ట్ ఎటాక్, పక్షవాతం, కంటి చూపు మందగించం, చెవుడు, తీవ్రమైన తలనొప్పి తలెత్తే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు, ప్రియాప్రెజం అంటే పురుష లైంగిక అవయవంలోని కణజాలం ఫైబ్రోసిస్‌కి గురై రాయిలా మారిపోయి సర్జరీ చేయాల్సి వస్తుంది. పైగా డాక్టర్ సలహా లేకుండా ఇలాంటి మందులు అస్సలు వాడకూడదు. ముందుగా మీరు అంగస్తంభన లోపానికి (ఎరక్టైల్ డిస్ఫంక్షన్) కారణాలను తెలుసుకోవాలి. ఒక్కోసారి గుండె సంబంధిత అనారోగ్యానికి అంగస్తంభన లోపం మొదటి లక్షణంగా బయటపడొచ్చు. కిడ్నీ, లివర్ వ్యాధులు, సెక్స్ హార్మోన్ల లోపాలు, థైరాయిడ్, డయాబెటిస్, వరిబీజం, ఆర్థరైటిస్ లాంటి సమస్యలు ఉన్నాయేమో పరీక్షించుకోవాలి. అప్పుడే లోపం ఏమిటన్నది స్పష్టంగా తెలుస్తుంది. అవసరం అయితే పినిల్ అండ్ స్క్రోటల్ కలర్ డాప్లేర్ పరీక్ష చేయించుకోండి. యూరో-ఆండ్రాలజిస్ట్‌ను, సెక్సాలజిస్ట్‌ను సంప్రదించండి. వయాగ్రా మందు తక్షణం మానేయండి.
డాక్టర్ భారతి
సెక్సాలజిస్ట్, సైకోథెరపిస్ట్, రైస్ హాస్పిటల్, హస్తినాపురం,
హైదరాబాద్. ఫోన్: 9849770409
ఈ మెయిల్: bharathid506@gmail.com
నా భర్తతో కలయిక అంటేనే చెమటలు పట్టి స్పృహ తప్పినంత పని అవుతున్నది”