44 రోజుల్లో 20.29 లక్షల ఆదాయం
పాపన్నపేట, జనవరి 21: పవిత్ర పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవానీ మాత ఆలయ హుండీని శుక్రవారం లెక్కించారు. హుండీ ఆదాయం 20.29 లక్షలు వచ్చినట్లు ఆలయ ఈవో సార శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం గోకుల్ షెడ్లో 44 రోజుల హుండీ ఆదాయాన్ని లెక్కించారు. దేవాదాయ ధర్మాదాయశాఖ ఇన్స్పెక్టర్ రంగారావు హాజరయ్యారు. కామారెడ్డికి చెందిన భ్రమరాంబిక సేవా సమితి సభ్యులతో పాటు దేవాదాయ ధర్మాదాయశాఖ సిబ్బంది సూర్యశ్రీనివాస్, మధుసూదన్‌రెడ్డి, లక్ష్మీనారాయణ,ప్రతాప్‌రెడ్డి, శ్రీనివాస్‌శర్మ, బ్రహ్మం, మహేశ్, నరేశ్ లెక్కింపులో పాల్గొన్నారు.