e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, October 21, 2021
Home News ఇసుక బుక్కిన ఈటల!

ఇసుక బుక్కిన ఈటల!

  • ఆరు నెలలపాటు నిరంతరాయంగా తరలింపు
  • డబుల్‌ బెడ్రూం ఇండ్ల పేరిట దోపిడీ బాగోతం
  • అనుచరుల ముసుగులో రాజేందర్‌ అక్రమాలు
  • అడ్డుకున్న యువతకు తీవ్ర బెదిరింపులు

జమ్మికుంట/జమ్మికుంట చౌరస్తా, అక్టోబర్‌ 13: పేదలకు సొంత గూడు కల్పించాలన్న మహత్తర ఆశయంతో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన డబుల్‌ బె డ్రూం ఇండ్ల నిర్మాణాలను సాకుగా చూ పి ఈటల రాజేందర్‌ ఇసుకాసురుడి అవతారం ఎత్తారు. నిత్యం 50 లారీల ద్వారా రూ.25లక్షల విలువైన ఇసుకను అక్రమంగా వరంగల్‌, హైదరాబాద్‌కు తరలించారని హుజూరాబాద్‌ ప్రజలు చెప్తున్నారు. ఆరు నెలలపాటు ఇసుక దోపిడీ నిరంతరాయంగా కొనసాగినట్టు గుర్తుచేశారు. ఇందుకోసం తన అనుచరులను రంగంలోకి దింపారని, అడ్డువచ్చిన వారిని భయబ్రాంతులకు గురిచేశారన్న ఆరోపణలు ఉన్నాయి. హుజూరాబాద్‌ నియోజకవర్గానికి కేసీఆర్‌ 4 వేల డబుల్‌ బెడ్రూం ఇండ్లను మంజూరు చేయగా, ఈటల అవినీతి బాగోతంతో నేటికీ ఒక్క ఇల్లు ప్రారంభానికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇసుక తరలింపునకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇండ్లు, ఇసుక క్వారీ కాంట్రాక్టులు తన బినామీలకే కట్టబెట్టినట్టు తెలిసింది. జమ్మికుంట మండల పరిధిలోని మానేరు నది నుంచి ప్రొక్లెయినర్లు, లారీల ద్వారా ఇసుక దోపిడీ యథేచ్ఛగా సాగించారని చెప్తున్నారు. ఈటల అవినీతి గురించి తెలిసినా నాడు మంత్రిగా ఉండటం తో ఏమీ చేయలేకపోయామని తెలిపారు. స్థానిక యువకులు ఇసుక తరలింపును అడ్డుకొంటే పోలీసులపై ఒత్తిడితెచ్చి అరెస్టు చేయించేవారని ఆరోపిస్తున్నారు.

అడ్డుకుంటే ఆగమే..
ఈటల ఇసుక దోపిడీని ఆపే ప్రయ త్నం చేసిన వారిపై కేసులు పెట్టి వేధించేవారని ఆరోపణలున్నాయి. జమ్మికుంట మం డలంలోని తనుగుల వాగులోంచి ఏకంగా ఎక్స్‌కవేటర్‌, లారీలతో ఇసుక తరలించేవారని స్థానికులు చెప్తున్నారు. మండల అధికారుల నుంచి జిల్లా ఉన్నతాధికారుల వరకు తన దందాను అడిగేనాథుడే లేకుండా చేశారని వినికిడి. లారీలను ఆపేందుకు ప్రయత్నించినా.. ఫిర్యాదులపై పోలీసులు స్పందించినా.. క్షణాల్లో ఈటల నుంచి ఫోన్‌ వచ్చేదని గుర్తుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు సైతం ఇసుక దందాను చూసీచూడన ట్టు ఉండేవారని తెలిసింది. భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని ఇసుక తరలింపు ను అడ్డుకు న్న యువకులను కొట్టిచ్చిన సందర్భాలున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. నిత్యం 50 లారీల ద్వారా 6 నెలలపాటు నిరంతరాయంగా ఇసుక దోపిడీ నడిచినట్టు తెలుస్తున్నది. రోజుకు రూ.25 లక్షల చొప్పున దాదాపు రూ.50 కోట్ల వరకు సొమ్ము చేసుకున్నట్టు సమాచారం. ఫలితంగా నియోజకవర్గంలో ఎన్నడో నిర్మాణాలు పూర్తికావాల్సిన డబుల్‌ బెడ్రూం ఇండ్లు ఇప్పటికి అసంపూర్ణంగా మిగిలాయని స్థానికులు ఆరోపించారు. రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లో నిరుపేదలెందరో ప్రభుత్వం నిర్మించిన డబుల్‌బెడ్రూం ఇండ్ల ల్లో నివాసం ఉంటుండగా, తమ నియోజకవర్గంలో ఒక్కటంటే ఒక్కటి కూడా నిర్మాణం పూర్తికాలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

- Advertisement -

ఊరోళ్లకు ఉపాధి లేకుండా చేసిండ్రు
ఊరిలో అవసరాల కోసం మేము వాగు నుంచి ఇసుక తెస్తే మా మీద కేసులు పెట్టించిండ్రు. వాళ్లు మాత్రం లారీల్లో ఇష్టమొచ్చినట్టు తీసుకపోయిండ్రు. ఇదేమని అడిగితే మమ్మల్ని పక్కకు నెట్టేసి మరీ ఇసుకను పట్టుకపోయిండ్రు. ఊరోళ్లమైన మాకే ఉపాధి లేకుండా చేసిండ్రు.

  • మహిపాల్‌రెడ్డి, తనుగుల గ్రామస్థుడు

అడ్డుకుంటే అణచివేసిండ్రు
మా గ్రామం నుంచి రోజు వందల లారీల్లో ఇసుక తీసుకపోయేటోళ్లు. ఇదేమని అడిగితే డబుల్‌ బెడ్రూం ఇండ్ల కోసమని చెప్పేటోళ్లు. ఇండ్లు కట్టుడు అయితలేదు కదా అని ప్రశ్నిస్తే పోలీసులతో బెదిరించేటోళ్లు. కొందరిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి కొట్టించిండ్రు.
– వాసాల రామస్వామి, సామాజిక కార్యకర్త, తనుగుల

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement