నోయిడా: ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా పోలీసులు ఓ సీరియల్ రేపిస్ట్‌ను అరెస్టు చేశారు. అనేక మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఆ రేపిస్ట్ నిందితుడు. అయితే గత రాత్రి సురాజ్‌పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఎన్కౌంటర్లో అతను పోలీసులకు చిక్కాడు. లూటీలు, దొంగతనాలకు కూడా అతను పాల్పడ్డాడు. ఎన్కౌంటర్లో గాయపడడంతో అతన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ మధ్యనే బెయిల్‌పై రిలీజైన రేపిస్ట్.. సురాజ్పూర్లో మరో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ కేసు విచారణలో సీరియల్ రేపిస్ట్ హస్తం ఉన్నట్లు తేలింది. గతంలో మహిళలను రేప్ చేసిన విధంగానే.. ఇటీవల కూడా కొన్ని కేసుల్లో ఆ పద్ధతులను అనుసరించాడు. దాని ఆధారంగా పోలీసులు అతన్ని పట్టుకున్నారు. ఒంటరిగా ఉండే మహిళలను టార్గెట్ చేసి అతను అటాక్ చేసేవాడు.