అలనాటి అందాల తారల శ్రీదేవి కూతురిగా ధడక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది జాన్వీకపూర్. ఆ తర్వాత ఘోస్ట్ స్టోరీస్, గుంజన్ సక్సేనా ప్రాజెక్టులతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రతీ యాక్టర్ ప్రయాణంలో (సెల్ఫ్ డౌటు) స్వీయ సందేహం ఓ భాగమని అంటోంది జాన్వీ. ప్రతీ నటీనటులు సెల్ఫ్ డౌట్‌తో బాధపడుతున్నారని అనుకుంటున్నా. కానీ అది నన్ను మరింత ఉత్తమంగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది.
నేను నిజంగా పనిచేయాలనుకునే దర్శకులున్నారు. నేను కళా ప్రక్రియకు అనుగుణంగా ఆలోచిస్తానో లేదో కూడా నాకు తెలియదు. నేను డిఫరెంట్ కథలు చేయాలనుకుంటున్నాను. కథలు కూడా చెప్పాలనుకుంటున్నానని చెప్పుకొచ్చింది. ఈ బ్యూటీ నటించిన రూహి చిత్రం నేడు ఆడియెన్స్ ముందుకొచ్చింది. హార్రర్ కామెడీ నేపథ్యంలో తెరెకెక్కింది రూహి.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.