నిర్మల్ : అక్రమంగా పెద్ద ఎత్తున్న తరలిస్తున్న నిషేధిత గుట్కా ప్యాకెట్లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. బీలోలి నుంచి నిర్మల్ వైపు గుట్కాను తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు పట్టణంలోని మంచిర్యాల చౌక్‌లో తనిఖీలు చేపట్టారు. బొలేరో వాహనంలో తరలిస్తున్న గుట్కా బ్యాగులను స్వాధీనం చేసుకొని షేక్ ముబీన్(౩౦) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
వీటి విలువ సుమారు రూ.4,72,700 ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగాపట్టణ సీఐ కుమారస్వామి మాట్లాడుతూ.. ప్రభుత్వం నిషేధించిన గంజాయి గుట్కా, టొబాకో ముడి పదార్థాలు కలిగి ఉన్నా, అక్రమంగా రవాణా చేసినా, ఇతరులకు అమ్మినా వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
కల్తీ పదార్థాలు ఎవరు అమ్మినా సహించేది లేదన్నారు. గ్రామాలలో, పట్టణాలలో గంజాయి, గుట్కాలు అమ్ముతున్న గుట్కాలు ఇళ్లల్లో, షాపుల్లో కలిగి ఉన్నారని సమాచారం తెలిస్తే వెంటనే డయల్ 100 సమాచారం అందించాలని సూచించారు.