న్యూఢిల్లీ, నవంబర్ 11: తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ర్టాల్లో చేపట్టిన ప్రత్యేక ఓటర్ల సమగ్ర సర్వే (సర్)ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు.. ఎన్నికల కమిషన్(ఈసీ)కి నోటీసులు జారీచేసింది. పిటిషన్లపై రెండు వారాల్లోగా తమ స్పందన తెలియజేయాలని ఈసీని ఆదేశించింది.
‘సర్’ను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లపై ఎలాంటి ఉత్తర్వులూ జారీచేయరాదని సర్వోన్నత న్యాయస్థానం మద్రాస్, కలకత్తా హైకోర్టులకు తెలిపింది. ‘బీహార్’లో సర్ ప్రక్రియపై విపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయగా, తాజాగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్లోనూ అదే పరిస్థితి నెలకొంది.