హీరో చిరంజీవి నటిస్తున్న సినిమా ‘గాడ్ ఫాదర్’. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్ పతాకాలపై కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాజకీయ నేపథ్య కథతో దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార, సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
రాజకీయ నాయకుడు జైదేవ్‌గా సత్యదేవ్ మరో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్ర లుక్‌ను తాజాగా విడుదల చేశారు. జైదేవ్ క్యారెక్టర్‌కు కథలో ప్రాధాన్యత ఉంటుందని చిత్రబృందం చెబుతున్నారు. ఈ సినిమా అక్టోబర్ 5న దసరా సందర్భంగా విడుదలకు సిద్ధమవుతున్నది.