కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్స్‌లో విడుదలైన తొలి సినిమా తిమ్మరుసు. జూలై 30న తిమ్మరుసుతో పాటు ఇష్క్ ఇట్స్ నాట్ ఎ లవ్‌స్టోరీ సినిమా కూడా విడుదలైంది. ఈ రెండింట్లో ఇష్క్ తొలిరోజే రేసు నుంచి తప్పుకుంది. ఇక మిగిలిన తిమ్మరుసు సినిమాకు బాక్సాఫీస్ దగ్గర కాసిన్ని డబ్బులు వచ్చాయి. కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్స్ వరకు జనం వస్తారా? రారా అనే అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి. అయితే సత్యదేవ్ సినిమా మాత్రం కాస్త నమ్మకాన్ని ఇచ్చింది. మరీ ఎక్కువ కలెక్షన్స్ అయితే రాలేదు కానీ పర్లేదు అనిపించింది. ఈ చిత్రాన్ని శరణ్ కొప్పిశెట్టి తెరకెక్కించాడు. మహేశ్ కోనేరు నిర్మించిన ఈ చిత్రం ఫైనల్ కలెక్షన్స్ వచ్చేశాయి. చేసిన బిజినెస్‌కు.. ఇప్పుడున్న పరిస్థితులకు.. సినిమా తీసుకొచ్చిన కలెక్షన్స్‌కు ఎక్కడా పెద్దగా పొంతన లేదు. ఫైనల్ రన్లో దాదాపు రూ.52 లక్షలు వెనకబడిపోయింది తిమ్మరుసు. అసలు ఈ చిత్రం ఫైనల్‌గా ఎన్ని కోట్లు వసూలు చేసిందో చూద్దాం..
నైజాం: 0.69 కోట్లు
సీడెడ్: 0.22 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.28 కోట్లు
ఈస్ట్: 0.17 కోట్లు
వెస్ట్: 0.11 కోట్లు
గుంటూరు: 0.17 కోట్లు
కృష్ణా: 0.14 కోట్లు
నెల్లూరు: 0.08 కోట్లు
ఏపీ + తెలంగాణ: 1.86 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 0.32 కోట్లు
వరల్డ్ వైడ్: 2.18 కోట్లు
సత్యదేవ్‌కు మార్కెట్ బాగానే ఉండటంతో తిమ్మరుసు సినిమాను రూ.2.4 కోట్లకు అమ్మారు. ఈ సినిమా విజయం సాధించాలంటే దాదాపు రూ. 2.7 కోట్ల వరకు రావాలి. అయితే ఫైనల్ రన్లో సినిమా కేవలం 2.18 కోట్లు మాత్రమే వసూలు చేసి దాదాపు 52 లక్షలు వెనకబడింది. అయితే శాటిలైట్, డిజిటల్ రైట్స్ కలుపుకుని నిర్మాతకు ఈ చిత్రం లాభాలే తీసుకొచ్చింది. కానీ బయ్యర్లకు మాత్రం స్వల్ప నష్టాలను మిగిల్చింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Bullettu Bandi Song|’బుల్లెట్టు బండి’ స్పందనపై వధూవరుల రియాక్షన్..వీడియో
భీమ్లా నాయక్‌లో రానా పాత్రను విలన్‌గా మార్చేస్తున్నారా?
జూనియర్ ఎన్టీఆర్ కచ్చితంగా సీఎం అవుతాడు.. టాలీవుడ్ నటుడి సంచలన వ్యాఖ్యలు
ఇంట్రెస్టింగ్ అప్డేట్..హీరోగా బండ్లగణేశ్..!
ముంబైలో మకాం.. సమంత స్పందన ఏంటి?