వెండితెరపై అలరిస్తున్న అందాల భామలు ఒక్కొక్కళ్లుగా పెళ్ళి పీటలెక్కుతున్నారు. ఈ మధ్య కాలంలో కాజల్ అగర్వాల్, నిహారిక పెళ్లి చేసుకోగా, మెహరీన్ మరి కొద్ది రోజులలో భవ్య అనే వ్యక్తిని పెళ్లాడనుంది. ఇక ఇప్పుడు కన్నడ బ్యూటీ సంజనా గల్రానీ కూడా పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమైనట్టు సమాచారం. డాక్టర్ పాషా అనే వ్యక్తితో సంజనా ఇప్పటికే నిశ్చితార్ధం జరుపుకుందని తెలుస్తుండగా, వీరి వివాహం సమ్మర్లో ఉంటుందని శాండల్‌వుడ్ సమాచారం.
ఏడాది క్రితం సంజనా .. అజీజ్ పాషా అనే వైద్యున్ని రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఆ వార్తలపై ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో ఆ వార్త పుకారుగానే మిగిలింది. తాజాగా సంజనా పెళ్లి వార్త మళ్లీ వార్తలలోకి ఎక్కడం ఆమె అభిమానులకు అయోమయం కలుగ జేస్తుంది. కాగా, సంజనా చేసుకోబోయే వ్యక్తి బెంగళూరులో ప్రముఖ ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల సంజనా డ్రగ్స్ కేసులో ఇరుక్కొని జైలుకు కూడా వెళ్లొచ్చిన విషయం తెలిసిందే.