e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, August 6, 2021
Home News సీఎం రిలీఫ్‌ఫండ్‌ చెక్కుల అందజేత

సీఎం రిలీఫ్‌ఫండ్‌ చెక్కుల అందజేత

సీఎం రిలీఫ్‌ఫండ్‌ చెక్కుల అందజేత

పటాన్‌చెరు, మార్చి 19: సీఎం రిలీఫ్‌ఫండ్‌ లబ్ధిదారులకు వరం అని పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్‌చెరు పట్టణంలో ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయం వద్ద దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ఎమ్మెల్యే సీఎం రిలీఫ్‌ఫండ్స్‌ చెక్కులను అందజేశారు. 29మంది వివిధ మండలాల లబ్ధిదారులకు రూ. 12లక్షల 55వేల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి సీఎంఆర్‌ఎఫ్‌ద్వారా సహా యం అందజేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గం అభివృద్ధికి అందరి సహకారం ఎంతో అవసరం అన్నారు. ప్రజలు మెచ్చేలా అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌, అమీన్‌ఫూర్‌ జడ్పీటీసీ సుధాకర్‌రెడ్డి, కార్పొరెటర్‌ కుమార్‌యాదవ్‌ నాయకులు దశరథరెడ్డి, వెంకట్‌రెడ్డి, విజయ్‌కుమార్‌ కార్యకర్తలు పాల్గొన్నారు
ఆపదలో అండగా సీఎంఆర్‌ఎఫ్
జిన్నారం, మార్చి19: ఆపదలో ప్రజలకు అండగా నిలుస్తుంది సీఎంఆర్‌ఎఫ్‌ అని ఎమ్మె ల్యే మహిపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలో పలువురికి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను జడ్పీవైస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌తో కలిసి ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందజేశారు. బొల్లారానికి చెందిన యాదగిరి, రఫీకాబీకి రూ. 60 వేలు , వావిలాల్‌కు చెందిన నాగరాజుకు రూ.40 వేలు, శివనగర్‌కు చెందిన వీరేశంకు రూ. 22 వేలు, మాదారంకు చెందిన శ్రావణికి రూ.30 వేలు,శంకరయ్యకు రూ.29 వేలు విలువ చేసే చెక్కును లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు. వీరితో పటాన్‌చెరు జడ్పీటీసీ సుధాకర్‌, కార్పొరేటర్‌ కుమార్‌, మాధవరం మాజీ సర్పంచ్‌ సురేందర్‌గౌడ్‌ పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సీఎం రిలీఫ్‌ఫండ్‌ చెక్కుల అందజేత
సీఎం రిలీఫ్‌ఫండ్‌ చెక్కుల అందజేత
సీఎం రిలీఫ్‌ఫండ్‌ చెక్కుల అందజేత

ట్రెండింగ్‌

Advertisement