Samsung Galaxy A04s | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ జెయింట్ శాంసంగ్ ( Samsung ).. మార్కెట్లోకి న్యూ లో బడ్జెట్ 4జీ స్మార్ట్ ఫోన్ `గెలాక్సీ ఏ04ఎస్ (Galaxy A04s) తీసుకొచ్చింది. 4జీబీ రామ్ విత్ 128 ఇంటర్నల్ స్టోరేజీ సామర్థ్యంతో వస్తున్న ఈ ఫోన్ ధర రూ.13,499గా ఉంటుంది. 5 మెగా పిక్సెల్ (ఎంపీ) ఫ్రంట్ కెమెరా విత్ 50 ఎంపీ ట్రిపుల్ కెమెరాతో వస్తోంది. 15 వాట్ల ఫాస్ట్ చార్జర్‌తోపాటు హెచ్డీ+ టెక్నాలజీతో 5000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ ఇందులో అమర్చారు. బ్లాక్, కాపర్, గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది శాంసంగ్ గెలాక్సీ ఏ04ఎస్.
డ్యూయల్ సిమ్ హైబ్రీడ్ స్లాట్ గల ఈ ఫోన్లో పవర్ బటన్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఉంది. యూజర్లు ఒకేసారి రెండు నానో సిమ్‌లు, మెమొరీ కార్డు వాడొచ్చు. ఈ స్మార్ట్ ఫోన్‌తో 4జీ కనెక్టివిటీ పొందొచ్చు. 50 ఎంపీ ట్రిపుల్ కెమెరాలో 50 ఎంపీ మెయిన్ (ఫోకస్ 1.8), 2 ఎంపీ డెప్త్ (ఫోకస్ 2.4), 2 ఎంపీ మాక్రో (ఫోకస్ 2.4) ట్రిపుల్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. బోకేష్ మోడ్ ఎఫెక్ట్‌తో సెల్ఫీ తీసుకోవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ ఏ04ఎస్ ( Samsung Galaxy A04s ) స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది. వన్యూ కోర్ 4.1 ప్రీ-ఇన్‌స్టలేషన్‌తో వస్తుంది. 6.5 అంగుళాల ఇన్ఫినిటీ-వీ డిస్ప్లే ఉంటుంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డు, వన్ కార్డ్, స్లైస్ ట్రాన్సాక్షన్స్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.1000 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. కొన్ని ఎంపిక చేసిన యాప్‌ల నుంచి బుకింగ్ చేస్తే రూ.1000 క్యాష్‌బ్యాక్ ఆఫర్ అందిస్తున్నది శాంసంగ్.