టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరోయిన్ సమంత (Samantha) టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం యశోద (Yashoda). పాన్ ఇండియా కథాంశంతో యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి హరి-హరీష్ దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 27న సాయంత్రం 5.36 గంటలకు ట్రైలర్ ను లాంఛ్ చేయనున్నారు. తెలుగు, తమిళంతోపాటు కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదలకానుంది.
కాగా ఈ మూవీ కన్నడ, మలయాళ, తమిళ వెర్షన్ ట్రైలర్‌ను ముగ్గురు స్టార్ హీరోలు లాంఛ్ చేయనున్నారు. యశోద ట్రైలర్‌ను రేపు కన్నడ హీరో రక్షిత్ శెట్టి, మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, తమిళ స్టార్ హీరో సూర్య లాంఛ్ చేయనున్నట్టు మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అయితే మిగిలిన భాషల్లో ఎవరు విడుదల చేస్తారన్నది తెలియాల్సి ఉంది.
శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న యశోదలో రావు రమేశ్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఉన్ని ముకుందన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన యశోద టీజర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది.
యశోద నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. సమంత మరోవైపు హిందీలో వరుణ్ ధవన్‌తో కలిసి వెబ్‌సిరీస్ కూడా చేస్తోంది. దీంతోపాటు విజయ్ దేవరకొండతో ఖుషీలో నటిస్తోంది. గుణ శేఖర్ డైరెక్షన్లో శాకుంతలం చేస్తుండగా.. షూటింగ్ పూర్తయింది.
ట్రైలర్ లాంఛ్ చేసే స్టార్ హీరోలు వీళ్లే..
National Award Winner, 'Nadippin Nayakan' @Suriya_offl will launch #Yashoda Tamil Trailer on 27th Oct @ 5.36 PM💥#SuriyaForYashoda #YashodaTrailer@Samanthaprabhu2 @varusarath5 @Iamunnimukundan @harishankaroffi @hareeshnarayan #Manisharma @krishnasivalenk @SrideviMovieOff pic.twitter.com/BmxthLIG4Q
— Sridevi Movies (@SrideviMovieOff) October 26, 2022
Heartthrob of Mollywood @dulQuer will launch #YashodaTrailer in Malayalam on Oct 27th @ 5:36 PM✨️#DulQuerForYashoda #YashodaTheMovie#Yashoda @Samanthaprabhu2 @varusarath5 @Iamunnimukundan @harishankaroffi @hareeshnarayan #Manisharma @krishnasivalenk @SrideviMovieOff pic.twitter.com/f7A37pSjuP
— Sridevi Movies (@SrideviMovieOff) October 25, 2022
The 'Simple Star' of Sandalwood @rakshitshetty will launch the KANNADA Trailer of #Yashoda on 27th Oct @ 5.36 PM💥#YashodaTrailer #YashodaTheMovie @Samanthaprabhu2 @varusarath5 @Iamunnimukundan @harishankaroffi @hareeshnarayan #Manisharma @krishnasivalenk @SrideviMovieOff pic.twitter.com/LsrLRtLMyO
— Sridevi Movies (@SrideviMovieOff) October 25, 2022
Read Also : SS Rajamouli | ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా ఆర్ఆర్ఆర్కు అవార్డు.. వీడియో
Read Also : Sardar 2 | మిషన్ కంబోడియా త్వరలో షురూ.. కార్తీ టీం సర్దార్ 2 వీడియో వైరల్
Read Also : Mohanlal | తగ్గేదేలే అంటున్న మోహన్‌లాల్.. జల్లికట్టు డైరెక్టర్‌తో కొత్త సినిమా
Read Also : Satya Dev | బాలీవుడ్‌లోనూ సత్యదేవ్ కుమ్మేశాడుగా.. తొలి సినిమాకే ప్రేక్షకులు ఫిదా