న్యూయార్క్, ఆగస్టు 13: కత్తిదాడికి గురైన రచయిత సల్మాన్ రష్దీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నది. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారని రష్దీ ఏజెంట్ అండ్య్రూ వైలీ పేర్కొన్నారు. సల్మాన్ రష్దీ ఒక కన్ను కోల్పోయే ప్రమాదం ఉన్నదని, కత్తిదాడితో కాలేయం దెబ్బతిన్నదని, చేతి నరాలు తెగిపోయాయ ని వెల్లడించారు. అమెరికాలో శుక్రవారం ఓ కార్యక్రమంలో రష్దీ ప్రసంగిస్తున్న సమయంలో వేదికపైకి దూసుకొచ్చి దాడి చేసిన వ్యక్తిని న్యూజెర్సీకి చెందిన హదీ మతార్‌గా పోలీసులు గుర్తించారు.