సల్మాన్ ఖాన్ (Salman Khan) టాలీవుడ్ హీరోలతో మంచి అనుబంధాన్ని కొనసాగిస్తాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రత్యేకించి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కుటుంబంతో మంచి సాన్నిహిత్యాన్ని మెయింటైన్ చేస్తుంటాడు. ప్రస్తుతం చిరంజీవితో కలిసి నటిస్తోన్న గాడ్ ఫాదర్ (Godfather) అక్టోబర్ 5న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిరు-సల్మాన్ టీం ప్రమోషనల్ ఈవెంట్స్‌తో ఫుల్ బిజీగా ఉంది.
ఈవెంట్లో చిరంజీవి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. గాడ్ ఫాదర్లో నటించడానికి సల్మాన్ ఖాన్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని చెప్పాడు. అంతేకాదు ఈ సినిమా కోసం నిర్మాతలు మార్కెట్లో ఉన్న డిమాండ్‌కు సరిపోయే ఆఫర్‌తో సల్మాన్ ఖాన్‌ను సంప్రదిస్తే..వెళ్లిపోండి అని హెచ్చరించాడట. అంతేకాదు ‘నాకు రాంచరణ్, చిరంజీవిపై ఉన్న ప్రేమను మీరు డబ్బుతో కొనలేరంటూ సల్మాన్ ఖాన్ నిర్మాతలకు చెప్పాడని’ చెప్పుకొచ్చాడు చిరు.
‘సల్మాన్ ఖాన్ మమ్మల్నందరినీ ఎంతో గౌరవిస్తాడు. మాకు కూడా అంటే సల్మాన్ అంటే అంతే గౌరవముంటుందని’ చిరంజీవి అన్నాడు. అయితే చిరంజీవి చేసిన కామెంట్స్ మార్కెటింగ్ స్టంట్స్ మాత్రమేనా..? నిజంగా సల్మాన్ ఖాన్ ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా ఎలా నటిస్తాడంటూ కొందరు నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు.
Read Also : Singer Alfaaz | దాబాలో సింగర్‌పై దాడి..ఇంతకీ జరిగిందంటే..!
Read Also : PS-1 US collections | యూఎస్ బాక్సాఫీస్ వద్ద పొన్నియన్ సెల్వన్-1 హవా..కలెక్షన్లివే
Read Also : SS Rajamouli | ప్రపంచంలోనే అతిపెద్ద ఐమాక్స్ థియేటర్లో ఎస్ఎస్ రాజమౌళి..వీడియో