మాస్కో: ఉక్రెయిన్లోని నాలుగు కీలక ప్రాంతాలను రష్యాలో కలుపుకోనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రేపు చేయనున్నారు. ఉక్రెయిన్లో ఉన్న లుగాన్స్క్, డోనెస్కీ, ఖేర్సన్, జాపొరిజియా ప్రాంతాలను ఇక నుంచి రష్యా ఆధీనంలోకి వెళ్లనున్నాయి. ఈ నాలుగు ప్రాంతాల్లో ఇటీవల రష్యా రెఫరెండమ్ నిర్వహించింది. అయితే ఆ ప్రాంత ప్రజలు రష్యాలో విలీనం అయ్యేందుకు అనుకూలంగా ఉన్నట్లు క్రెమ్లిన్ అధికారులు తెలిపారు. విలీన ప్రక్రియపై పుతిన్ రేపు ప్రకటన చేయనున్నారు.