e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home News వనపర్తి జిల్లాలో రహదారుల నిర్మాణాలకు రూ.15.90 కోట్లు మంజూరు

వనపర్తి జిల్లాలో రహదారుల నిర్మాణాలకు రూ.15.90 కోట్లు మంజూరు

వనపర్తి జిల్లాలో రహదారుల నిర్మాణాలకు రూ.15.90 కోట్లు మంజూరు

వనపర్తి : జిల్లాలోని గ్రామీణ రోడ్లకు మహర్దశ పట్టిందని, 3 వంతెనలు, నాలుగు రహదారులకు రూ.15.90 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఘణపురం మండలం అపారెడ్డిపల్లి – ఆముదంబండ తండా రహదారిపై వంతెనకు రూ.కోటి 20 లక్షలు, గోపాల్ పేట మండలం గుడ్డిమోత వాగు వంతెనకు రూ.కోటి 28 లక్షలు, వనపర్తి మండలం చాకలిబండ వాగు వంతెనకు రూ.కోటి 80 లక్షలు మంజూరయ్యాయని పేర్కొన్నారు.
ఘణపురం మండలం మానాజిపేట – గట్టుకాడిపల్లి రహదారికి రూ.2 కోట్ల 99.70 లక్షలు, అప్పారెడ్డిపల్లి – ఆముదంబండ తండా రోడ్డుకు రూ.4 కోట్ల 70.50 లక్షలు, పెబ్బేరు మండలం సూగూరు – మునగమాన్ దిన్నె రోడ్డుకు రూ. కోటి 83.10 లక్షలు, రేవల్లి మండలం తల్పునూరు – కేశంపేట తండా రోడ్డుకు రూ.2 కోట్ల 9 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు మంత్రి నిరంజన్‌ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వనపర్తి జిల్లాలో రహదారుల నిర్మాణాలకు రూ.15.90 కోట్లు మంజూరు

ట్రెండింగ్‌

Advertisement